Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరత్నధారణతో ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసా?

Webdunia
FILE
నవరత్నాలను ధరించడం ద్వారా ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసుకోవాలనుందా.. అయితే ఈ కథనం చదవండి. కెంపు రత్నానికి సూర్యుడు పితృకారకుడు.. ఈ రత్నాన్ని ధరించడం ద్వారా తండ్రివైపు ఆస్తులు, మగ సంతానం, ఉన్నతాధికారము కలుగుతుంది.

అలాగే మాతృకారకుడైన చంద్రుడి అనుగ్రహం కోసం ముత్యము ధరించాలి. ముత్యమును ధరిస్తే తల్లివైపు వారి నుంచి మంచి జరుగును. శత్రు, రోగ, రుణ విముక్తులు కావొచ్చు. మగ సంతానం కలుగుతుంది.

జాతిపచ్చకు బుధుడు అధిపతి. బుధుడు బంధుకారకుడు కావడంతో.. పచ్చను ధరిస్తే బంధువర్గం ద్వారా మంచి జరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, విద్యాభివృద్ధి కలుగును.

గురువు పుత్రకారకుడు- కనుక కనకపుష్యరాగాన్ని ధరించడం ద్వారా సంతానం ద్వారా ధన, ధాన్య, గృహ, వాహనప్రాప్తి ఉంటుంది. దైవపూజ, యజ్ఞయాగాదులు తీర్థయాత్రలు కలిగించును.

శుక్రుడు భార్యకారకుడు- కాబట్టి వజ్రాన్ని ధరించడంతో అత్తమామల ద్వారా ధన, ధాన్య, గృహ వాహన ప్రాప్తి కలుగుతుంది. ఇక శని శ్రమ, ఆయుష్షు కారకుడు.. అందుచేత నీలము ధరించాలి. నీలమును ధరిస్తే శ్రమపడటంతో మంచి జరుగుతుంది. ఆయుర్వుర్ధి కలుగుతుంది. పరిశ్రమలలో గుర్తింపు లభిస్తుంది.

ఇక రాహువు ఐశ్వర్యకారకుడు.. కాబట్టి గోమేధికాన్ని ధరిస్తే.. విద్యలో అడ్డంకులు తొలగిపోతాయి. సంతానప్రాప్తి చేకూరుతుంది. కేతువు జ్ఞానకారకుడు కావడంతో.. మోక్షప్రాప్తి కలుగుతుంది. భక్తి, జ్ఞాన, తీర్థయాత్ర, యజ్ఞయాగాదులు కలిగించును.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments