Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు అక్షరాల ఆధారంగా మీ సంఖ్య

Webdunia
తెలుగు అక్షరాలను అనుసరించి సంఖ్యను తెలుసుకునే విధానంలో ఇంటిపేరును కలిపి కూడినట్లయితే ఖచ్చితంగా వారి సంఖ్య వస్తుంది. కొంతమందికి ఒకే పేరు ఉంటుంది. అటువంటప్పుడు ఏం చేయాలి అన్న సందేహం వస్తుంది. అప్పుడు ఇంటిపేరుతోపాటు పేరు కూడగా వచ్చిన సంఖ్యలు కలుపగా వచ్చిన సంఖ్యను బట్టి వారి సంఖ్యను నిర్ణయిస్తారు. ముఖ్యంగా దీర్ఘములుగల అక్షరాలకు దీర్ఘములు తీసివేయాలి. అంటే కాత్యాయనీ అనే పేరుగలవారు మొదటి అక్షరము 'క' గా గమనించాలి. అంటే...

అ - లూ - క - ట - ప - య = 1
ఆ - ఎ - ఖ - ఠ - ఫ - ర = 2
ఇ - ఏ - గ - డ - బ - ల = 3
ఈ - ఐ - ఘ - ఢ - భ - వ = 4
ఉ - ఒ - ణ - మ - శ = 5
ఊ - ఓ - ఛ - త - ష = 6
ఋ - ఔ - ఛ - థ - స = 7
జ - ద - హ = 8
అలు - ఝ - ధ - క్ష = 9

ఉదాహరణకు నందమూరి తారక రామారావు అనే పేరును పరిశీలిద్దాం...
పైన తెలిపిన అక్షరాల సంఖ్యను పరిశీలిస్తే... 'నం' అనే అక్షరములకు సంఖ్యలేదు. అంటే 0 ద అనే అక్షరమునకు 8వలైనులో చూడండి. ద అనే అక్షరం ఉంది. అంటే.... 0+0+8. ఇక మూ అనే అక్షరం 5వ లైనులో ఉంది. అంటే... మ అనే అక్షరము తీసుకోవాలి.
అక్షరముల యొక్క సంఖ్యలను కూడి మరలా వచ్చిన మొత్తం సంఖ్యలకు కూడాలి.

న 0 ద మూ రి తా ర క రా మా రా వు
0+ 0 + 8 + 5 + 2 + 6 + 2 + 1 + 2 + 5 + 2 + 4

మొత్తం 37 అవుతుంది. అంటే... 3+7= 10 0 లెక్కకు రానందున ఈ పేరు కలవారు 1 వ సంఖ్య వారు అవుతారు.
ఇలా అన్ని తెలుగు పేర్లకు సంబంధించి ఇదే రీతిలో సంఖ్యలను తెలుసుకోవచ్చు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

వాస్తు దోషాలు, గ్రహ దోషాలకు చెక్ పెట్టాలంటే..?

కార్తీక పౌర్ణమి- 11 పిండి దీపాలను స్వచ్ఛమైన నెయ్యితో..?

మహానంది కోనేరులో ఆలయ గోపురాలు.. ఫోటో వైరల్

వైకుంఠ చతుర్దశి: శివాలయంలో దీపదానం చేస్తే ఏంటి ఫలితం?

14-11-2024 గురువారం ఫలితాలు - ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి...

Show comments