Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్ఞానవంతులు... రెండో సంఖ్యవారు

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2008 (12:29 IST)
FileFILE
రవికి తదుపరి వచ్చు గ్రహం చంద్రుడు. ఒకటవ సంఖ్య తదుపరి సంఖ్య 2. దీనికి అధిపతి చంద్రుడు. 2, 11, 19,20 తేదీలలో జన్మించినవారు సోమవారం, రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రంనందు జన్మించినవారు కూడా రెండో సంఖ్యవారవుతారు. వీరు మంచి ఆకారం కలవారుగానూ... ఆకర్షణీయమైన కనులు, పుష్టికరమైన శరీరం, మంచి ఛాయగలవారుగానూ ఉంటారు. వారి తీరు ఎదుటివారిని ఆకర్షించు స్వభావం గలవారు, సున్నితమైన మనస్కులుగలవారై ఉంటారు. వీరి అభిప్రాయములు వీరి ముఖమునందు స్పష్టంగా గోచరిస్తాయి.

అందరికీ మంచి చేయు గుణం కలవారు. మంచి విద్య, జ్ఞానం, ఎదుటివారి కష్టములను చూసి వెంటనే సహాయం చేయువారుగా ఉంటారు. ఎదుటివారిని బాధించే స్వభావం లేనివారు. రచనా రంగంలో మంచి జ్ఞానం గలవారు. జీవితంలో ఊహించని అభివృద్ధికి ఆస్కారం కలవారు. నిదానమే ప్రధానం సూత్రాన్ని అనుసరించేవారు. ప్రతి విషయంలోను త్వరపడి నిర్ణయం తీసుకోనివారై ఉంటారు. ఆధ్యాత్మిక చింతన కలవారు. ప్రతి పనీ తేలికగా నెరవేర్చుకొను స్వభావం కలవారు. మంచి బుద్ధిమంతులు.

ప్రకృతిని ఆరాధించేవారు, ప్రశాంత జీవనాన్ని కోరుకునేవారు. తమ సమస్యలు ఎదుటివారికి తెలియకుండా జాగ్రత్తగా పరిష్కరించుకొనువారు. ఏ విషయంలోనైనా ఏకాగ్రతతో పని నెరవేర్చుకొనువారు, ఏదైనా తమ తప్పు తెలుసుకుని వెంటనే సరిదిద్దుకునేవారు. వీరికి అసలు కోపమనేది రాదు. ఉన్నట్లుండి జీవితంపై విరక్తి స్వభావం కలవారు, చంచలత్వం సామాన్యముగా ఉండువారు, స్వతంత్ర జీవితముపైగానీ, ఎవరి వద్ద అయినా పని తలపెట్టినా ఆ పని పూర్తి అయ్యే వరకూ విశ్రాంతి తీసుకోకుండా పనిని ముగించుకునేవారు. ప్రతి చిన్న విషయంలోనూ అధికమైన భయాన్ని కలిగి ఉండేవారు. తమ జీవిత విషయాలను దాచుకోలేనివారై ఉంటారు. వీరు అతి శుభ్రవంతులు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

లేటెస్ట్

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

30-06-2025 సోమవారం దినఫలితాలు - వాగ్వాదాలకు దిగవద్దు... సహనం పాటించండి..

29-06-2025 ఆదివారం దినఫలితాలు - శ్రమించినా ఫలితం ఉండదు...

Show comments