Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెంపును కుడిచేతి ఉంగరపు వ్రేలుకు ధరించండి!

Webdunia
శనివారం, 5 నవంబరు 2011 (16:24 IST)
FILE
ఎత్తు: 3 గురిగింజ ఎత్తు కెంటే తక్కువ ఉండరాదు. అందువల్ల 3 గురిగింజ ఎత్తు వుంటే ఉత్తమం. (పూర్వకాలపు ప్రమాణములు)

లోహము: బంగారంలో కెంపును ధరించాలి. మొత్తం 4 గురిగింజ ఎత్తు తక్కువ వుండరాదు. (పూర్వకాలపు ప్రమాణములు)

ప్రభావము: కెంపు ధరించిన సమయం నుండి 4 స ం|| రాల వరకు పనిచేస్తుంది.

బరువు: 5 గురిగింజ ఎత్తు బరువు గల రాగి గాని బంగారంలో చేయించాలి. (పూర్వకాలపు ప్రమాణములు)

తయారు చేయవలసిన సమయం: ఆదివారం లేదా కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ నక్షత్రాల రోజు ఉదయం గం. 9-00ల నుండి 12 గంటల లోపుగా.

శుద్ధి చేసే విధానము: పచ్చిపాలు లేక గంగాజలములో ఒక రోజు వుంచాలి.

జపించవలసిన మంత్రము: ఓం హ్రీం సూర్యాయ నమః

సంఖ్య: 6,000 సార్లు

ధరించవలసిన వ్రేలు: కుడిచేతి ఉంగరపు వ్రేలుకు ధరించాలి.

పూజావిధానము: 1. శివాలయంలోని నవగ్రహముల మండలపములోని సూర్యుని విగ్రహము వద్ద ఉంగరము వుంచి సూర్య అష్టోత్తరము చేయించి 1 1/4 కేజీల గోధుమలు ఎర్రని వస్త్రములో దానం చేయగలరు.
2. ఆదివారం రోజున ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపుగా శివాలయంలో ఏకాదశి రుద్రాభిషేకములో ఉంగరము ఉంచి శుద్ధి చేయించగలరు.
3. బ్రాహ్మణునితో 6000 సార్లు సూర్యుని వేదమంత్రం జపము చేయించి ఉంగరమునకు ధారాదత్తం చేయగలరు.
4. కనీసం ధరించే వ్యక్తి సూర్యుని ధ్యాస శ్లోకము 70 మార్లు పారాయణ చేసి ధరించగలరు.
5. అరసవెల్లి, గొల్లలమామిడాడ, పెద్దాపురం క్షేత్రములలో సూర్యదేవాలయం దర్శించినప్పుడు ఉంగరమునకు పూజ చేయించగలరు.

ధరించవలసిన సమయం: ఆదివారం, కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాల రోజున, రథసప్తమి.

దానం చేయవలసినవి: ప్రమిదెలు, గోధుమలు, మందారపువ్వు, కుంకుమ

ధారణ ఫలితములు: పుత్రసంతాన, రాజకీయ లబ్ధి, ఆరోగ్యము.
అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీకి తలనొప్పిగా మారిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి!

నా భార్య ఓ అద్భుతం - ఎన్ని గంటలు పని చేశామని కాదు.. : ఆనంద్ మహీంద్రా

పదేళ్ల క్రితం పక్కింటి కుర్రోడితో పారిపోయిన కుమార్తె.. యూపీలో పరువు హత్య!!

కక్ష్యకు అత్యంత సమీపానికి చేరుకున్న స్పేడెక్స్ ఉపగ్రహాలు : ఇస్రో

అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మహిళపై గ్యాంగ్ రేప్ .. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

10-01-2025 శుక్రవారం దినఫలితాలు : అవకాశాలను చేజిక్కించుకుంటారు...

ముక్కోటి ఏకాదశి: ఉత్తర ద్వారం నుంచి విష్ణు దర్శనం, విశిష్టత ఏమిటి?

09-01-2025 గురువారం దినఫలితాలు : ఆ రాశివారికి పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది....

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం

అవి ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం : తితిదే ఈవో శ్యామల రావు

Show comments