Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్కాటకరాశిలో జన్మించారా? అయితే ముత్యం ధరించండి

Webdunia
కర్కాటకరాశిలో జన్మించిన జాతకులు "ముత్యం"ను ధరించాలని రత్నాలశాస్త్ర నిపుణులు అంటున్నారు. నవరత్నాలలో ఒకటైన "ముత్యం" తెలుపుగా పాలరాతి రంగులో ఉంటుంది. ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున ఈ జాతకులు తరచూ మార్పుకోరుకునే వారుగా ఉంటారు. వీరిలో కల్పనాశక్తి, భావుకత్వం మెండుగా ఉంటుంది. ఇతరులతో అంత సామాన్యంగా కలిసిపోరు. సిగ్గుపడేవారుగానూ, వివేక వంతులుగానూ ఉంటారు.

ఈ రాశికి చెందిన జాతకులు ముత్యాన్ని ధరించడం ద్వారా చంద్రగ్రహ దోషాలను నివారిస్తుంది. మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది. ఆవేశము, మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. ఈ రాశిలో పుట్టిన ఆడవారు ఎక్కువగా ముత్యాల హారాలను ఉపయోగించడం మంచిది. అదేవిధంగా చెవులకు రింగ్స్‌గా కూడా ధరించవచ్చు. మగవారైతే చేతికి బంగారంతో పొదిగిన ముత్యాలను ఉంగరాలుగా ధరించవచ్చు.

ముత్యాన్ని ఎలా ధరించాల ి? కుడిచేతి ఉంగరపు వ్రేలుకు ముత్యపు ఉంగరాన్ని ధరించాలి. సోమవారం సూర్యోదయానికి ధరిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. వెండి లోహముతో పొదింగించిన ముత్యపు ఉంగరాలనే ధరించడం ఉత్తమం. ముత్యాన్ని ముందుగా పాలులోగానీ, గంగా జలములో గానీ శుద్ధి చేసిన తర్వాతే ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదం... 42కి చేరిన మృతుల సంఖ్య

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankashti Chaturthi: ఆషాఢ శుక్ల పక్షం- చతుర్థి వ్రతం - రవియోగం- వినాయక పూజతో అంతా శుభం

హమ్మయ్య.. తిరుమలలో తగ్గిన ఫాస్ట్ ఫుడ్స్- కారం, నూనె పదార్థాలొద్దు.. ఆ వంటకాలే ముద్దు!

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

Show comments