Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర నక్షత్రం.. మొదటి పాదంలో పుట్టిన వారైతే..!

Webdunia
WD
ఉత్తర నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారైతే.. వెండితో పొదిగించిన కెంపును ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. కెంపును ధరించడం ద్వారా ఉన్నత స్థానాలను అలంకరించడం, వ్యాపారాభివృద్ధి చేకూరుతుందని వారు చెబుతున్నారు.

ఇంకా ఉత్తర నక్షత్రంలో పుట్టిన జాతకులు ఆరు సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు వీరికి చంద్ర మహర్ధశ కావున ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది.

అలాగే 16-23 సంవత్సరాల వరకు ఈ జాతకులకు కుజమహర్దశ జరుగుతున్నందువల్ల పగడమును బంగారంతో పొదిగించుకుని ధరించడం ద్వారా సుగుణవతి అయిన భార్య లభిస్తుందని రత్నాల శాస్త్రం చెబుతోంది. పగడమును ధరించడం ద్వారా సుఖసంతోషములు చేకూరుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

ఇకపోతే.. 41-57 సంవత్సరాల మధ్యలో గురు మహర్ధశ నడవంతో ఈ జాతకులు పుష్యరాగమును బంగారముతో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించాలి. ఇంకా 57-76 వయస్సుకు మధ్య శని మహర్ధశ కావడంతో నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

అలాగే 76 సంవత్సరాల తర్వాత ఉత్తర నక్షత్రం తొలి పాదంలో పుట్టిన జాతకులకు బుధ మహర్ధశ కావున పచ్చను బంగారుతో పొదిగించి చిటికెన వేలుకు ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఇంకా ఈ నక్షత్రములో పుట్టిన జాతకులకు ఈతిభాదలు తొలగిపోవాలంటే ప్రతి శనివారం విష్ణుమూర్తికి నువ్వుల నూనెతో దీపమెలిగించడం మంచిది. ఇలా తొమ్మిది వారాలు చేయడం ద్వారా ఈతిబాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

'నువ్వు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే'.. కొడుకు క్రికెట్ బ్యాటుతో కొట్టి చంపిన తండ్రి... ఎక్కడ?

వైద్య విద్యార్థిని గుండె కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్

బై నాన్నా... మీరు ఒక ఫైటర్ నాన్నా.. తండ్రి గురించి హీరో భావోద్వేగ పోస్ట్

చిన్నాన్న భౌతికకాయంతో స్వగ్రామానికి చేరుకున్న మంత్రి లోకేశ్... నేడు అంత్యక్రియలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం... రూ.300 కోట్ల ఆస్తి నష్టం

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీక పౌర్ణమి- 11 పిండి దీపాలను స్వచ్ఛమైన నెయ్యితో..?

మహానంది కోనేరులో ఆలయ గోపురాలు.. ఫోటో వైరల్

వైకుంఠ చతుర్దశి: శివాలయంలో దీపదానం చేస్తే ఏంటి ఫలితం?

14-11-2024 గురువారం ఫలితాలు - ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి...

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్- శ్రీవాణి కౌంటర్‌లో ఇక దర్శనం టిక్కెట్లు

Show comments