Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్విని 3వ పాదం : జన్మకారుల రత్నధారణ

Webdunia
శనివారం, 16 ఆగస్టు 2008 (19:15 IST)
అశ్విని నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వారికి ఆరు నెలల వరకు కేతు మహర్దశ సంచరించును. ఈ దశలో వైఢూర్యాన్ని వెండిలో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించినట్లైతే మంచి ఫలితాలను ఇస్తుందని రత్నాల శాస్త్రకారులు తెలుపుతున్నారు. ఆరు నెలల నుండి 23 సంవత్సరాల ఆరు నెలల వరకు శుక్రమహర్దశ జరుగుతుంది. ఈ దశలో వజ్రాన్ని బంగారుతో ఉంగరపు వేలుకు ధరించాలని వారు వెల్లడిస్తున్నారు.

23 ఏళ్ల ఆరు నెలల వయస్సు నుండి 29 సంవత్సరాల ఆరు నెలల వరకు రవిమహర్దశ జరుగుతుండటంతో... ఈ దశలో కెంపును ఉంగరపు వేలుకు ధరించాలని, 29 ఏళ్ల ఆరు నెలల నుంచి 39ఏళ్ళ ఆరు నెలల వరకు వయస్సు వరకు చంద్రమహర్దశ జరుగును. ఈ దశలో ముత్యమును పొదిగించుకున్న వెండి ఉంగరాన్ని.... ఉంగరపువేలుకు ధరించాలని రత్నశాస్త్రవాదుల వాదన.

39 సంవత్సరాల ఆరు నెలల నుంచి 46 ఏళ్ళ ఆరు నెలల వయస్సు వరకు కుజ మహర్దదశ సంచరిస్తుంది. ఈ దశలో పగడాన్ని బంగారంతో పొదిగించుకుని వేలుకు ధరించినట్లైతే శుభపరిణామాలు ఉంటాయని రత్నశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు.

46 ఏళ్ల ఆరు నెలల వయస్సు నుండి 64 సంవత్సరాల ఆరు నెలల వరకు వరకు రాహు మహర్దశ. ఈ దశలో గోమేధికం వెండితో కలిపిన ఉంగరాన్ని ధరించాలని నిపుణులు తెలుపుతున్నారు. 64 ఆరు నెలల నుండి 80 ఏళ్ల ఆరు నెలల వయస్సు వరకు గురుమహర్దశ ఈ దశలో పుష్యరాగమును బంగారంతో కలిపి చూపుడు వేలుకు ధరించినట్లైతే మంచి ఫలితాలను ఇస్తాయని రత్ననిపుణులు వెల్లడిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీక పౌర్ణమి- 11 పిండి దీపాలను స్వచ్ఛమైన నెయ్యితో..?

మహానంది కోనేరులో ఆలయ గోపురాలు.. ఫోటో వైరల్

వైకుంఠ చతుర్దశి: శివాలయంలో దీపదానం చేస్తే ఏంటి ఫలితం?

14-11-2024 గురువారం ఫలితాలు - ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి...

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్- శ్రీవాణి కౌంటర్‌లో ఇక దర్శనం టిక్కెట్లు

Show comments