మరో బ్యాంక్ స్కామ్ :రూ.3250 కోట్ల రుణాలు.. రూ.64 కోట్ల లంచం

దేశంలో మరో భారీ బ్యాంక్ స్కామ్ వెలుగు చూసింది. ఇపుడు కుంభకోణం జరిగిన బ్యాంక్ అషామాషీ బ్యాంకు కాదు. దేశంలో ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్‌లో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యా

Webdunia
శుక్రవారం, 30 మార్చి 2018 (09:20 IST)
దేశంలో మరో భారీ బ్యాంక్ స్కామ్ వెలుగు చూసింది. ఇపుడు కుంభకోణం జరిగిన బ్యాంక్ అషామాషీ బ్యాంకు కాదు. దేశంలో ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్‌లో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంకు. తాజాగా దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో వెలుగుచూసిన మరో కుంభకోణం కలకలం రేపుతోంది.
 
ఈ ప్రైవేటు బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ నుంచి వీడియోకాన్‌కు అక్రమంగా రూ.3,250 కోట్ల రుణం వెళ్లగా, అందుకు ప్రతిఫలంగా రూ.64 కోట్లను లంచంగా పొందారు. ఈ మొత్తాన్ని క్విడ్ ప్రోక్వో రూపంలో లబ్దిగా పొందారు. ఇలా లబ్ది పొందిందిన వ్యక్తి ఎవరో కాదు.. ఆ బ్యాంకు సీఈఓ చందా కొచ్చర్‌ కావడం గమనార్హం. ఈ నిధులు కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ చేతికందినట్టు ప్రచారం సాగుతోంది. 
 
వివిధ కంపెనీల ద్వారా క్విడ్ ప్రోక్వో జరిగిందని ఓ పరిశోధనాత్మక కథనం ఈ విషయాన్ని వెలుగులోకి తేగా, మొత్తం వ్యవహారం బ్యాంకింగ్ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. దీనిపై నిజానిజాలు తేల్చేందుకు సీబీఐ, ఈడీ తదితర దర్యాఫ్తు సంస్థలు దృష్టిని సారించాయి. కాగా, ఇప్పటికే ఐసీఐసీఐకు భారత రిజర్వు బ్యాంకు భారీ మొత్తంలో పెనాల్టీ విధించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments