ఇండేన్ గ్యాస్ వినియోగదారులూ.. ఏమరపాటుతో జీరో నొక్కారో... సబ్సీడీ వదులుకున్నట్టే!

Webdunia
శుక్రవారం, 17 జులై 2015 (16:08 IST)
ఇండేన్ గ్యాస్ వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రతినెలా గ్యాస్ బండ కోసం బుకింగ్ చేసుకునే సమయంలో పొరపాటున లేదా ఏమరపాటుతో జీరో నొక్కినట్టయితే సబ్సీడీ వదులుకున్నట్టే. ఆ తర్వాత ఒక యేడాది పాటు మీరు అరిచిగీపెట్టుకున్నా తిరిగి సబ్సీడీతో రాయితీని పొందలేరు.
 
"రండి. GiveItUpలో భాగస్వామ్యం కండి.. మీరు భరించే శక్తి ఉంటే తక్షణమే గ్యాస్ సబ్సిడీ వదులుకోండి.. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోవడానికి ముందుకు వస్తే.. ఇలా ప్రభుత్వానికి మిగిలే ప్రతి పైసాను పేదల వంటింట్లో ఖర్చు పెట్టేలా చేస్తాను". ఇదీ గ్యాస్ రాయితీ వదులుకునే అంశంలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు.. సబ్సిడీ అనేది అల్పదాయవర్గాలకు మాత్రమేనని, కానీ ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలు, ఇందులో అత్యధికంగా ధనికులు సబ్సిడీ పొందుతున్నారని భావించిన చమురు కంపెనీలు, కేంద్రం ఇటీవల రాయితీ వదులుకునే విషయంపై విస్తృతంగా ప్రచారం చేపట్టింది. మోడీ ఇచ్చిన పిలుపునకు సంపన్నకుటుంబాల వినియోగదారులు స్పందిస్తున్నారు.
 
ఈ ప్రచారానికి మరోవైపు ఆయిల్ కంపెనీలు దొంగదెబ్బ తీసేందుకు సిద్ధపడ్డాయి. రాయితీ వదులుకునే అంశంలో విస్తృతస్థాయిలో ప్రచారం చేసే కార్యక్రమాలు చేయాల్సింది పోయి.. మొబైల్ సాంకేతిక పరిజ్ఞానం ముసుగులో అసలు సిసలైన అర్హులను ఈ సబ్సిడీ నుంచి ఉద్దేశ్యపూర్వకంగా దూరం చేస్తోంది. గ్యాస్ బండ కోసం బుకింగ్ చేసుకునే క్రమంలో ఇచ్చే ఆఫ్షన్లలో వినియోగదారుడు కొంచెం ఏమరపాటుతో 0 (సున్నా) బటన్ నొక్కితే చాలు ఏడాది పాటు గ్యాస్ సబ్సిడీ పోయినట్టే.
 
పొరపాటున 0 బటన్ ప్రెస్ అయితే.. ఇక అంతే వెంటనే గ్యాస్ సబ్సిడీ వదులుకున్నట్లు మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత ఇండేన్ గ్యాస్ కంపెనీని సంప్రదించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇతర ఆయిల్ కంపెనీలతో పోల్చితే.. ఒక్క ఇండేన్ గ్యాస్ ఆఫ్షన్ మాత్రమే ఈ తరహా ప్రమాదానికి కారణంగా ఉంది. అందుకే ఇండేన్ గ్యాస్ వినియోగదారులంతా బుకింగ్‌లో ఆప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ పోచమ్మ గ్లింప్స్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు సాన

అడివి శేష్ డెకాయిట్‌ కు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్

Samaira: కామాఖ్య నుంచి ఫ్రెండ్షిప్ మెలోడీ సఖీ సాంగ్ రిలీజ్

Adi Sai Kumar: ఆది సాయి కుమార్ కొత్త చిత్రం టైటిల్ సైరాబాను

Bellamkonda Sai : తిరుమలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి వివాహం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

ఎడిసన్ టౌన్‌షిప్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్: ప్రజా భద్రతపై అవగాహన సదస్సు

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?