రూ.5 వేల కోట్లు దోచుకున్న బ్యాంకులు... ఎలా?

చేతిలో నిలువదనే ఉద్దేశ్యంతో పైసా పైసా కూడబెట్టి కొంత మొత్తంగా తీసుకెళ్లి బ్యాంకు ఖాతాలో వేసి భద్రపరుచుకుంటాం. కానీ, ఆ బ్యాంకులు మాత్రం ఏవేవో కుంటిసాకులతో ఆ పైసాను పైసాను నిలువుదోపిడి చేస్తున్నాయి.

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (12:00 IST)
చేతిలో నిలువదనే ఉద్దేశ్యంతో పైసా పైసా కూడబెట్టి కొంత మొత్తంగా తీసుకెళ్లి బ్యాంకు ఖాతాలో వేసి భద్రపరుచుకుంటాం. కానీ, ఆ బ్యాంకులు మాత్రం ఏవేవో కుంటిసాకులతో ఆ పైసాను పైసాను నిలువుదోపిడి చేస్తున్నాయి.


తాజాగా దేశంలోని అన్ని బ్యాంకులు కనీస నిల్వ లేదన్న సాకుతో ఏకంగా రూ.5 వేల కోట్లను దోచుకున్నాయి. ఇందులో ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంకు ఏకంగా రూ.2433 కోట్ల మేరకు పెనాల్టీ రూపంలో దోచుకుంది. 
 
ఇటీవల మెట్రో నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ కనీస నిల్వ పాటించాలంటూ అన్ని బ్యాంకులు జీవోను జారీ చేశాయి. ఇదే బ్యాంకులకు మంచివరంగా లభించింది. బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్‌ నిర్వహించలేదన్న సాకుతో వినియోదారుల నుంచి బ్యాంకులు రూ.5 వేల కోట్లు దోపిడీ చేశాయి. 
 
ఈ మొత్తాన్ని 21 ప్రభుత్వ, మూడు మేజర్‌ ప్రైవేటు బ్యాంకులు 2017-18 ఆర్థిక సంవత్సరంలో కనీస బ్యాలెన్స్‌ నిర్వహించని ఖాతాదారుల నుంచి జరిమానా రూపంలో వసూలు చేశాయి. భారతీయ స్టేట్ బ్యాంకు అత్యధికంగా రూ.2,433.87 కోట్లు వసూలు చేయగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.590.84 కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్‌ రూ.530.12 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.317.6 కోట్లు చొప్పున జరిమానా రూపంలో వసూలు చేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments