Webdunia - Bharat's app for daily news and videos

Install App

13 శాతం పెరిగిన బియ్యం ధరలు!

Webdunia
నిత్యావసర సరుకుల ధరల్లో కేవలం బియ్యం మాత్రమే ఏకంగా 13 శాతం పెరిగింది. ఇది ఎన్నడూ ఊహించలేనంతగా పెరిగిందంటున్నాయి మార్కెట్ వర్గాలు. ఇది ఒక్క ఏడాదిలోనే ఈ స్థాయికి చేరుకోవడం ఆందోళన కరంగా ఉందని, ఇలా పెరుగుతూ పోతే పేద, మధ్య తరగతి ప్రజలు బియ్యం కొని తినే పరిస్థితి లేదని వారు వాపోయినట్లు అసోచెమ్ ఎకో పల్స్ స్టడీ తెలిపింది.

నిరుడు ఆగస్టు నుంచి ఈ ఆగస్టు లోపల ఒక్క ఏడాదిలోనే బియ్యం ధరలు ఏకంగా 13.15 శాతం పెరిగాయి. అదే గోధుమలు 4.71 శాతం పెరిగాయి. దీంతో ప్రజలు ఈ వస్తువులను కొనేందుకు వెనుకాడుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని ప్రజలు భావిస్తున్నారు.

భారతదేశంలో బియ్యం, గోధుమల ధరల్లో పెరుగుదల అనే శీర్షికతో అసోచెమ్ ఎకో పల్స్ స్టడీ సర్వే నిర్వహించింది. తన సర్వేలో వెల్లడైన వివరాలననుసరించి నిరుడు ఆగస్టు నెలలో గోధుమల ధర ప్రతి క్వింటాల్ రూ. 1,167.54లుగా ఉండింది. అదే ఈ ఏడాది ఆగస్టు నెలలో గోధుమలు ప్రతి క్వింటాల్ ధర రూ. 1,222.48లకు చేరుకుంది. ఈ విధంగా గోధుమలు 4.71 శాతం వృద్ధి జరిగింది.

అదే బియ్యం ధరల్లో కూడా 13.15 శాతం వృద్ధి జరిగిందని సంస్థ తెలిపింది. నిరుడు ఆగస్టు నెలలో బియ్యం ప్రతి క్వింటాల్ ధర రూ. 1,873.94లుగా ఉండింది. అదే ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రతి క్వింటాల్ ధర రూ. 2,120.29లకు చేరుకుంది.

హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ ఏడాది ఆగస్టులో అన్ని రాష్ట్రాలకన్నా కూడా ధరలు తక్కువగానే కనపడ్డాయి. కేరళ, కర్నాటక, అసోం, మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాలలో ఈ ఆగస్టులో గోధుమలు ధరలు పెరిగాయి అదే బియ్యం ధరల్లో తగ్గుదల కనపడింది.

ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ మరియు ఒరిస్సా రాష్ట్రాలలో బియ్యం ధరల్లో తగ్గుదల కనపడింది. ముఖ్యంగా ఢిల్లీలో బియ్యం ధరల్లో తగ్గుదల కనపడి 8.07 శాతానికి చేరుకుంది. అదే విధంగా ఉత్తరప్రదేశ్‌లో 5.89 శాతం మరియు ఒరిస్సాలో 3.66 శాతం తగ్గుదల నమోదైనట్లు సంస్థ తెలిపింది.

నిరుడు ఆగస్టు నెల అసోంలో గోధుమల ధరలు ప్రతి క్వింటాల్ రూ. 1,042.25లుగా ఉండింది. అదే ఈ ఏడాది ఆగస్టులో గోధుమలు ప్రతి క్వింటాల్ రూ. 1,559.80లకు చేరుకుంది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో నిరుడు గోధుమలు ప్రతి క్వింటాల్ ధర రూ. 1,022.11లుగా ఉండింది.

అదే ఈ ఏడాది గోధుమలు పెరిగి ప్రతి క్వింటాల్ ధర రూ. 1,250లకు చేరుకుంది. కేరళ రాష్ట్రంలో గోధుమల ధరలు ఈ ఏడాది ఆగస్టు నెలకు 49 శాతం పెరిగింది. అదే అసోంలో బియ్యం ధరల్లో 49 శాతం పెరుగుదల కనపడిందని అసోచెమ్ పేర్కొంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments