Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యా రుణాలపై మరింతగా తగ్గనున్న వడ్డీః హెచ్ఆర్‌డీ

Webdunia
సోమవారం, 10 మే 2010 (14:01 IST)
దేశంలోని విద్యార్థులకు అందజేస్తున్న విద్యా రుణాలపై వసూలు చేస్తున్న వడ్డీని మరింతగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుంటోందని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ(హెచ్ఆర్‌డీ) తెలిపింది.

ఇందులో భాగంగా వైద్య విద్య, ఇంజనీరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీల్లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివే వారికి రుణ కాలపరిమితిని పెంచుతూ కనీస వడ్డీ రేటును దాదాపు 4 శాతం మేరకు నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

వడ్డీ రేటుః మీ పిల్లలు తీసుకునే విద్యా రుణంపై మీ జీతాన్నిబట్టి వడ్డీ రేటుంటుంది.

* వార్షికాదాయం రూ. 4.5 లక్షల్లోపున్న తల్లిదండ్రుల పిల్లలకు ఇచ్చి విద్యా రుణాలపై నాలుగు శాతం వడ్డీని విధించనుంది.

* వార్షికాదాయం రూ. 4.5 లక్షలకు పైగా ఉండే తల్లిదండ్రుల పిల్లలు తీసుకునే విద్యారుణంపై 7 శాతం మేరకు వడ్డీ రేటు ఉంటుంది.

* రుణ మొత్తాన్ని రూ. 12 లక్షలకు పైగా తీసుకుంటే తొమ్మిది శాతం వడ్డీ వుంటుంది.

ప్రస్తుతానికైతే వడ్డీ రేట్లు ఇలానే ఉంటాయి. రానున్న రోజుల్లో మార్కెట్ స్థితిగతులననుసరించి వడ్డీ రేట్లలో మార్పులుండవచ్చని అధికారులు తెలిపారు.

నాలుగు లక్షల రూపాయల రుణాన్ని తీసుకుంటేః మేనేజ్‌మెంట్ కోర్సును చదివేటటువంటి మహిళా విద్యార్థిని తీసుకునే రూ. 4 లక్షల రుణానికి ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.50 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. ఇదే మొత్తానికి బ్యాంక్ ఆఫ్ బరోడా 9 శాతం మేరకు వడ్డీని వసూలు చేస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జమ్ము అండ్ కాశ్మీర్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9.5 శాతం నుంచి 9.75 శాతం మేరకు వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఇతర బ్యాంకులు 10 శాతం నుంచి 13.25 శాతం వడ్డీని వసూలు చేస్తున్నట్లు అప్నాపైసా డాట్ కామ్ వివరించింది.

రూ. 4లక్షల నుంచి రూ. 7.5 లక్షల మధ్య తీసుకునే రుణాలుః రూ. 4 లక్షల నుంచి రూ. 7.5 లక్షల వరకు తీసుకునే విద్యా రుణాలకు బ్యాంక్ ఆఫ్ ఇండియా అతి తక్కువగా 9 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. అదే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9.50 శాతం వడ్డీని వసూలు చేయగా ఇతర బ్యాంకులు 10 శాతం నుంచి 14 శాతం మేరకు వడ్డీని వసూలు చేస్తున్నాయి.

రూ. 7.5 లక్షలకు పైగా తీసుకునే విద్యా రుణాలకు వడ్డీ రేట్లుః రూ. 7.5 లక్షలకు పైగా తీసుకునే విద్యా రుణాలకు కెనరా బ్యాంక్ అత్యంత తక్కువ వడ్డీ రేటును అమలు చేస్తూ 8.75 శాతం మేరకు వసూలు చేస్తోంది. అదే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్‌లు 9.50 శాతం మేరకు వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఇతర బ్యాంకులు 10 శాతం నుంచి 13.50 శాతం మేరకు వడ్డీని వసూలు చేస్తున్నట్లు అప్నాపైసా డాట్ కామ్ తెలిపింది.

ఇతర బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్‌లు 12-14 శాతం మేరకు విద్యారుణాలపై వడ్డీని వసూలు చేస్తున్నాయి. అదే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 14 శాతానికి పైగానే వడ్డీని వసూలు చేస్తోంది.

ఇదిలావుంటే విద్యార్థిని తీసుకునే విద్యా రుణానికి చెల్లించే వడ్డీ రేటులో విద్యార్ధి తీసుకునే అదే మొత్తం విద్యా రుణంపై వడ్డీ రేటును అదనంగా 1-2 శాతం అధికంగా చెల్లించాల్సివుంటుంది. అదే కొన్ని బ్యాంకులు విద్యార్థినీ, విద్యార్థులకు సమంగా వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నాయి.

మారటోరియంపై వడ్డీ లేదుః విద్యా రుణం తీసుకున్న తొలి మూడు సంవత్సరాల కాలానికి ప్రభుత్వం వడ్డీని భరించేందుకు ప్రణాళికను రూపొందించుకుందని, మిగిలిన నాలుగు సంవత్సరాల కాలపరిమితికి విద్యార్థి అసలు, వడ్డీతో సహా చెల్లించాల్సివుంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

విద్యా రుణాన్ని తిరిగి చెల్లించే విధానం: ప్రభుత్వం రూపొందించుకున్న నూతన రుణపథకంలో భాగంగా విద్యా రుణాన్ని తిరిగి చెల్లించే విధానంలో కాలపరిమితి 5-7 సంవత్సరాల నుంచి 6-12 సంవత్సరాలకు పెంచే ఆలోచనలోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇప్పటి వరకైతే రుణాన్ని తిరిగి చెల్లించే కాలం 7 సంవత్సరాలకుంది. మీరు తీసుకునే విద్యా రుణం మొత్తంపై కార్పోరేషన్ లాంటి కొన్ని బ్యాంకులు 10 సంవత్సరాల వరకు పొడిగించాయి. రుణాన్ని తిరిగి చెల్లించే కాలాన్ని పెంచడంతో రుణం తీసుకున్న విద్యార్థికి వెసలుబాటు కలుగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments