Webdunia - Bharat's app for daily news and videos

Install App

మౌలిక వసతుల కల్పనలో భారత్ పురోగతి

/indiaprwire/
గురువారం, 20 నవంబరు 2008 (12:30 IST)
దేశీయ మౌలిక కల్పనా సంస్థలు 2008లో సాధించిన పురోగతి దేశీయ ఆర్థికాభివృద్ధికి సంకేతాలుగా నిలుస్తున్నాయని గురువారం విడుదలైన "ఇండియాస్ లీడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ 2008" పుస్తకం పేర్కొంది. ప్రపంచ వాణిజ్య సమాచారాన్ని అందించే కీలక సంస్థ డన్ అండ్ బ్రాడ్‌షీట్ సంస్థ తన పుస్తకం రెండవ ఎడిషన్‌ను గురువారం విడుదల చేసింది.

డన్ అండ్ బ్రాడ్‌షీట్ సంస్థ తాజా సంకలనంలో 210 ప్రముఖ భారతీయ కంపెనీల వివరాలను ప్రచురించింది. వీటిలో 117 కంపెనీలు నిర్మాణ రంగానికి చెందినవి కాగా 72 సంస్థలు విద్యుత్ రంగానికి, 10 సంస్థలు టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లకు చెందినవి కావడం విశేషం.

భారతీయ మౌలిక వసతి కల్పనా రంగం ఇటీవల కాలంలో సాధించిన కీలక విజయాలను ఈ ప్రచురణ ఎత్తి చూపించే ప్రయత్నం చేసింది. వాస్తవంగా కూడా, ఈ పుస్తకం భారతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల సమాచారం గురించిన చక్కటి వనరుగా రూపొందింది.

డన్ అండ్ బ్రాడ్‌షీట్ సంస్థ భారత్ సీఈఓ డాక్టర్ మనోజ్ వైష్ ఈ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ, గత కొద్ది సంవత్సరాలుగా భారత్ విశేష పురోగతి సాధించినప్పటికీ, భారతీయ మౌలిక వసతుల కల్పనా రంగంలో పస్తుతం లభ్యమవుతున్న పెట్టుబడులు డిమాండ్ మరియు సరఫరా మధ్య అంతరాన్ని పూడ్చే స్థాయిలో లేవని చెప్పారు.

ఈ ఆర్థిక సంవత్సరానికి గాను అంతర్జాతీయ మౌలిక వసతుల సూచిలో భారత్ 72వ స్థానంలో నిలిచిందని, గతంతో పోలిస్తే 10 స్థానాల దిగువకు దిగజారిపోయిందని మనోజ్ చెప్పారు. అంటే ఇతర దేశాలు ఈ మధ్య కాలంలో భారత్‌కు మించి పురోగతి సాధించాయినే దీనర్థమని పేర్కొన్నారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ తన పురోగతిని కొనసాగించనుందని భావిస్తున్నప్పటికీ, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో భారత్ వృద్ధి రేటు కాస్త మందగించవచ్చునని మనోజ్ తెలిపారు.

దేశీయ మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులను ఎక్కువగా వెచ్చించగలిగితే ఆర్థికాభివృద్ధిలో దీర్ఘకాలంలో నిలకడ సాధించవచ్చని, దీనివల్ల పలు అవకాశాలు దేశంముందు నిలుస్తాయని మనోజ్ సూచించారు. భారత్‌లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని ఆధునికీకరించడంతో పాటు అదనపు పెట్టుబడులను కూడా ఈ రంగంలోకి మళ్లించాలని చెప్పారు.

భారతీయ మౌలిక వసతుల కల్పనా రంగంలో విద్యుత్, టెలికామ్, రేవులు, నిర్మాణరంగం వంటి కీలక విభాగాల్లో ప్రముఖ కంపెనీలను "ఇండియాస్ లీడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ 2008" పుస్తకం పరామర్శించింది. ఈ ప్రచురణలో 210 భారతీయ కంపెనీల వివరాలను అందించగా వీటిలో 117 కంపెనీలు విమానాశ్రయాలు, ఓడరేవుల అభివృద్ధి, రియల్ ఎస్టేట్, పారిశ్రామిక యూనిట్ల నిర్మాణం, రైల్వేలు, సెజ్‌లు, సామాజిక మౌలిక వసతుల కల్పన వంటి రంగాలకు సంబంధించినవే కావడం విశేషం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Show comments