Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థికమాంద్యం ఎందుకు వచ్చింది...?

Webdunia
FILE
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యానికి ప్రధాన కారణం కొత్త కొత్త సాంకతిక మార్పులేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. గత రెండు దశాబ్దాలలో స్టీమ్ ఇంజన్ తర్వాత విద్యుత్, వాయుయానం(విమానం) టెలిఫోన్ తదితర వస్తువులను మానవుడు కనుగొన్నాడు.

మానవుడు కొత్త కొత్త వస్తువులను కనిపెట్టడంతో అభివృద్ధి చెందిన దేశాలు మరింత అభివృద్ధి చెంది లాభాలను ఆర్జించాయి. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ కంపెనీకి చెందిన ఆఫీస్ డివిజన్ గత సంవత్సరంలో 1413 వందల కోట్ల డాలర్ల అమ్మకాలు కొనసాగించింది. దీనిపై 913 వందల కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆ కంపెనీ ఆర్జించింది.

ఆ కంపెనీ పొందిన లాభాలు దాదాపు 65 శాతానికి చేరుకుంది. అదేవిధంగా జెట్ ఎయిర్‌వేస్, పర్సనల్ కంప్యూటర్, జెనెటిక్ మాడిఫైడ్ విత్తనాలు మొదలైన ఉత్పత్తుల ద్వారా లాభాలను పొందాయి. వృద్ధి చెందిన దేశాలు తమ కార్మికులకు, ఉద్యోగులకు అత్యధికమైన వేతనాలు ఇచ్చి వారిని ప్రోత్సహించాయి. ఉదాహరణకు జనరల్ మోటార్స్‌లో పని చేస్తున్న వారి ప్రస్తుత జీతం రూ. 27 వేలుగా ఉంది.

జనరల్ మోటార్స్ కార్ల ఉత్పత్తికి చెందిన సాంకేతిక నిపుణత ఆ కంపెనీ వద్ద వున్నంత వరకు ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు మెరుగ్గానే ఉండింది. అత్యధికంగా వేతనాలు పొందడంతో వారి విలాసవంతమైన జీవితాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.

ఆర్థికాభివృద్ధి జరిగిందిలా: కొత్త కొత్త సాంకేతిక ఉత్పత్తులను కనుగొని వాటిని అభివృద్ధి చెందిన దేశాలు ఇతర దేశాలకు ఎక్కువ ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవడంతో పలు కంపెనీలు ఆదాయాన్ని మూటగట్టుకున్నాయి. దీంతో విదేశీ కంపెనీల్లోని ఉద్యోగులకు అధిక వేతనాలు చెల్లించాయి. ఇదివరకటి దశాబ్దంలో ఇంటర్నెట్ సమ్రాజ్యానిది. 1998 తర్వాత ఐదు సంవత్సరాలలో సాంకేతిక వ్యవస్థ అభివృద్ధితోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు.

అదే 2002లో సాంకేతిక రంగంలో మార్పులు సంభవించి క్షీణ దశకు చేరుకుంది. దీంతో ఆర్థికంగా లోటు ఏర్పడింది. అమెరికాలో పరిశ్రమలు మూతపడే స్థితికి చేరుకున్నాయి. ఎందుకంటే నిర్మాణ రంగంలో మార్పులు సంభవించి చైనా మరియు తూర్పు ఆసియా దేశాలతోపాటు భారతదేశంలోనున్న కంపెనీలకు ఇచ్చే పనులుకూడా నిలిచిపోయాయి.

దీంతో మాంద్యం పెరిగిపోయింది. ఈ మాంద్యం స్వల్పమేనని అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ మరియు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అధ్యక్షుడు ఎలన్ గ్రీన్‌స్పైన్‌లు సంయుక్తంగా ప్రకటించారు.
FILE


ఈ విధంగా ఉద్భవించిన మాంద్యం భవిష్యత్తులో తగ్గుముఖం పడుతుందనే ధీమాతోనే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తక్కువ వడ్డీకే గృహ రుణాలు అధికంగా ఇవ్వడం జరిగింది. అమెరికాలో మాంద్యం అతి స్వల్పమేనని అప్పటి అధ్యక్షుడు అమెరికా ప్రజలకు సూచించారు. దీంతో అక్కడి ప్రజలు అధిక సంఖ్యలో గృహాలను కొనుగోలు చేసేందుకు గృహ రుణాలు తీసుకుని గృహాలను కొన్నారు.

FILE
అమెరికాలోని జనరల్ మోటార్స్ సంస్థలో పని చేసే ఉద్యోగి నెలసరి జీతం రూ. 27 వేలు ఉండగా అదే ఉద్యోగి భారతదేశంలోని కార్మికుల జీతంగా ఐదు వందల రూపాయలు తీసుకునేవారు. ఇదే పరిస్థితి కాల్ సెంటర్లలోను ఉండేది. అంటే అమెరికాలోని ఉద్యోగుల జీతభత్యాలు ఆకాశాన్నంటేటివి. భారతదేశంలోని ఉద్యోగుల జీతభత్యాలు కాస్త మెరుగ్గా ఉండేటివి. ఓవైపు అమెరికాలోని పలు కంపెనీలు ఉద్యోగులను తొలగించడం ప్రారంభించడంతో వారి ఆదాయం తగ్గుముఖం పట్టింది. దీంతో వారు గృహ రుణాలు కట్టలేక పోయారు.

దీంతో సదరు బ్యాంకులు వారి గృహాలను జప్తు చేసాయి. జప్తు చేసిన గృహాలు, వస్తువులను అమ్మేందుకు బ్యాంకులు ప్రయత్నించగా కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో ప్రాపర్టీ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. బ్యాంకులు నష్టాల బాటలో పయనించడం మొదలు పెట్టాయి. ఏ ప్రాపర్టీ మీదైతే బ్యాంక్ ఐదు లక్షల డాలర్ల అప్పు ఇచ్చిందో, అదే ప్రాపర్టీని జప్తు చేసుకున్న తర్వాత దానిని కేవలం రెండు లక్షల డాలర్లకే అమ్మేందుకు సిద్ధమైంది. దీనినిబట్టి పరిస్థితి ఎంత దిగజారిందో అంచనా వేసుకోవచ్చంటున్నారు ఆర్థిక నిపుణులు.

ఇలా పలు బ్యాంకులు మాంద్యంలో మునిగిపోయాయి. తొలుత లెహ్‌మన్ బ్రదర్స్, బీమా కంపెనీ ఏఐజీ మరియు మేరిల్ లించ్ కంపెనీలు చేతులెత్తేసాయి. దీంతో అమెరికాలోని పలు కంపెనీలు మాంద్యంతో అతలాకుతలమైయ్యాయి.

ఏవిధంగానైతే క్యాన్సర్ రోగికి ప్యారాసిటమాల్ మాత్రలు ఇస్తే తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది. వ్యాధి మళ్ళీ తిరగతోడుతుంది. అదే పరిస్థితి ఆర్థిక రంగంలోను తలెత్తిందని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు.

ప్రస్తుత మాంద్యానికి కారణం అమెరికానే ప్రథమ సూత్రమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
IFM


తప్పెవరిది: అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం తలెత్తేందుకు ప్రధాన కారణం అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ మరియు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అధ్యక్షుడు ఏలన్ గ్రీన్‌స్పైన్‌లేనని ఆర్థిక నిపుణులు ఘంటాపదంగా చెపుతున్నారు. బుష్ భవిష్యత్తులో రాబోయే మాంద్యం గురించి ముందుగానే పసిగట్టి ఉంటే ఇంత భారీ నష్టం సంభవించేది కాదంటున్నారు అంతర్జాతీయ ఆర్థికరంగ నిపుణులు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments