Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిఫా 2018 : పొలాండ్‌పై కొలంబియా విజయం

రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా గ్రూపు హెచ్‌ విభాగంలో ఆదివారం జరిగిన పోటీల్లో పోలాండ్‌పై కొలంబియా జట్టు విజయం సాధించింది. కీలకమైన మ్యాచ్‌లో పోలాండ్ ఓడిపోవడంతో ఆ టీమ్

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (11:53 IST)
రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా గ్రూపు హెచ్‌ విభాగంలో ఆదివారం జరిగిన పోటీల్లో పోలాండ్‌పై కొలంబియా జట్టు విజయం సాధించింది. కీలకమైన మ్యాచ్‌లో పోలాండ్ ఓడిపోవడంతో ఆ టీమ్ క్వార్టర్స్‌కు అర్హత సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది. ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్‌లో కొలంబియా 3-1 తేడా గోల్స్‌తో విక్టరీ నమోదు చేసింది.
 
గ్రూప్‌లోని మొదటి మ్యాచ్‌లో జపాన్ చేతిలో అనూహ్య ఓటమిని ఎదుర్కొన్న కొలంబియా ఈ మ్యాచ్‌లో సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో కొలంబియా ఆటగాళ్లు మీనా (40వ నిమిషం), ఫాల్కో(70వ నిమిషం), జు కాడ్రాడో(75వ నిమిషం)లు గోల్స్ చేశారు. ఈ టోర్నీలో పోలాండ్ ఆటతీరు నిరాశను నింపింది. సెనెగల్‌తో ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓడిన పోలాండ్ ఈ మ్యాచ్‌లోనూ అదే తరహా ప్రదర్శన కనబరిచింది. 
 
కాగా, గ్రూప్ 'హెచ్‌'లో జపాన్, సెనెగల్ నాలుగేసి పాయింట్లతో ముందంజలో ఉన్నాయి. కొలంబియాకు మూడు పాయింట్లు ఉన్నాయి. కొలంబియా తన చివరి మ్యాచ్‌ను సెనెగల్‌తో ఆడుతుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో గెలిస్తే, ఆ జట్టు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తుంది. లేనిపక్షంలో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments