ఉగాది నాడు శ్రీరాముడిని స్మరించండి.. పంచాంగ శ్రవణం మంచిది..!

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2016 (17:23 IST)
ఉగాది నాడు శ్రీరాముడిని స్మరిస్తే శుభఫలితాలుంటాయి. అందుచేత శ్రీరామ మంత్రాన్ని 108 సార్లు పూజ చేసేటప్పుడు పఠించాలి. ఇంకా అభ్యంగన స్నానం, నూతన వస్త్రధారణ, భగవత్పూజ పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి భక్షణం మంచిదని పండితులు అంటున్నారు.

ఉగాది రోజున తెల్లవారు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు పూజ చేయడం మంచిది. ఉగాది మనకు సంవత్సరాది. ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తానలేచి, అభ్యంగన స్నానం చేయడం అతిముఖ్యమైన విధి. ఉగాది నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులూ దేవిని ఆరాధిస్తారు. 
 
అలాగే ఉగాది రోజున అభ్యంగన స్నానానికి అనంతరం పూజామందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి మామిడి తోరణాలు, పూజా మందిరాన్ని రంగవల్లికలతో అలంకరించుకోవాలి. మీకు నచ్చిన లేదా ఇష్టదేవతా పూజ చేసుకోవచ్చు. పూజకు ఉగాది పచ్చడి నైవేద్యం, పసుపు రంగులు పుష్పాలు వాడాలి. ఉగాది పండుగ రోజున ఉదయం ఆరు గంటల నుంచి 9 గంటల వరకు పూజ చేయవచ్చు. దీపారాధనకు రెండు ప్లస్ రెండు దూది వత్తులు, ఆవునెయ్యి వాడాలి. 
 
అలాగే ఉగాది నాడు ఇంతకుముందు చూడని పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం మంచిది. ఆలయాల్లో వసంతనవరాత్ర ఉత్సవములు నిర్వహించడం, లేదా మీ శక్తి చేయించగలిగే పూజ చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. 
 
ఇంకా ఆలయాల్లో పంచాంగ శ్రవణం వినండి. అలాగే ఆలయాల్లో వసంతనవరాత్ర ఉత్సవాలు జరిపించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలగే గోచార ఫలితాలపై ఉపన్యాసాలు ఇప్పించడం మంచిది. ఉగాది రోజున పూజ చేసేటప్పుడు పంచహారతి ఇవ్వడం, నుదుటన కుంకుమ ధరించాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం ఎక్కి నేరుగా వస్తా, ఒప్పుకుంటే శాంతి లేదంటే బాంబులేస్తా: ట్రంప్ వార్నింగ్

జేజేఈ మెయిన్ -2026 ఫలితాలు.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు రెండు ర్యాంకులు

Milk and ghee: రూ.7.78 లక్షల విలువైన పాలు, నెయ్యి స్వాధీనం

ప్రకాష్ రాజ్‌పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: కరాటే కళ్యాణి

రూ.7వేల కోసం తమ్ముడు, అతని గర్భిణీ భార్యను హతమార్చాడు.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

Simhadri Appanna: అక్షయ తృతీయ నాడే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. చందనోత్సవం

Parashurama Jayanti 2026: ప్రదోష కాలంలో జన్మించిన పరశురాముడు.. పూజ ఇలా చేస్తే?

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున శని, రాహు దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి..?

19-04-2026 నుంచి 25-04-2026 వరకు మీ వార ఫలితాలు

18-04-2026 శనివారం ఫలితాలు - కొన్ని సమస్యల నుంచి బయటపడతారు

Show comments