Webdunia - Bharat's app for daily news and videos

Install App

షడ్రుచుల ఉగాది పచ్చడి... ఆరోగ్య ప్రదాయిని

షడ్రుచుల సమ్మేళనంతో తయారుచేసే శ్రేష్టమైన పదార్థమే ఉగాది పచ్చడి. ఆధ్యాత్మిక పరంగా ఈ పచ్చడికి ఎంత ప్రాముఖ్యత ఉందో, ఆహార - ఆరోగ్యం పరంగాను అంతే ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. ఈ పచ్చడి సేవించడం ద్వారా దివ్యమైన ఆరోగ్యం కలుగుతుందని వైద్యనిపుణులు కూడా సూచిస్

Webdunia
మంగళవారం, 28 మార్చి 2017 (20:35 IST)
షడ్రుచుల సమ్మేళనంతో తయారుచేసే శ్రేష్టమైన పదార్థమే ఉగాది పచ్చడి. ఆధ్యాత్మిక పరంగా ఈ పచ్చడికి ఎంత ప్రాముఖ్యత ఉందో,  ఆహార - ఆరోగ్యం పరంగాను అంతే ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. ఈ పచ్చడి సేవించడం ద్వారా దివ్యమైన ఆరోగ్యం కలుగుతుందని వైద్యనిపుణులు కూడా సూచిస్తున్నారు. ఈ ఉగాది పచ్చడిలో.. వేపపువ్వు, చింతపండు, మామిడికాయలు, బెల్లం, మిరియాలు, ఉప్పు వేసి తయారుచేస్తారు.
 
1. వేప : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ వేప పువ్వు బుధుడికి సంబంధించినది. ఇందులో వ్యాధి నిరోధక లక్షణాలు అనేకం. రుతు మార్పు వల్ల పిల్లల్లో వచ్చే ఆటలమ్మ, స్పోటకం, కలరా, మలేరియా సోకకుండా వేప నిరోధకంగా పనిచేస్తుంది. ఒకరకంగా ఇది యాంటీ వైరస్ ప్రొటెక్టర్ అవుతుందన్నమాట. గుమ్మానికి వేపాకులు కట్టడం వల్ల కలుషితం లేని స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి వస్తుంది. వేపపువ్వుకు రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది.
 
2. బెల్లం : ఇది గురుగ్రహానికి చెందిన వస్తువు. దీంట్లో ఔషధ గుణాలు ఎక్కువ. అందుకే ఆయుర్వేదంలో చాలా మందులకు దీనిని అనుపానంగా వాడతారు. ఇక గర్భవతులు బెల్లాన్ని తింటే చాలా మంచిదట. బెల్లం రక్తప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది. బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలుంటాయి. అది అజీర్తి, పొడి దగ్గులాంటి రోగాలు రాకుండా చేస్తుంది. గురుడు కలిసిమెలిసి ఉండే గుణాల్ని మన మనసులో పెంపొందిస్తాడు. అందుకే అది బెల్లం ద్వారానే జరుగుతుందన్నమాట. 
 
3. మామిడికాయ : మామిడి ముక్కల్లో తీపి, పులుపులతో పాటు వగరు గుణముంటుంది. ఈ గుణం శుక్రుడికి ప్రతీక. ఈయన సౌందర్యాధిపతి. చర్మం ఆరోగ్యంగా, ముడతలు పడకుండా ఉండేందుకు ఇది బాగా పనికొస్తుంది. విపరీతమైన చలి తర్వాత వేడితో పెదవులు పగుతుంటాయి. మామిడిలోని వగరు దాన్ని నివారిస్తుంది. ఇక ఇందులో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తి పెంచేలా చేస్తుంది, చర్మ వ్యాధులు రాకుండా చూస్తుంది.
 
4. చింతపండు : ఇది కూడా శుక్రునికి సంకేతమే. మామిడి ముక్కలతో చింతపండు పులుపు కలిసి మనకు మరింత ఆలోచనా శక్తిని పెంచి సన్మార్గంలో నడిపిస్తుంది. టెన్షన్, హడావిడి లేని జీవితాన్ని గడపగలరు. ఈ పులుపు వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చింతపండు మనలో చింతను దూరం చేస్తుంట. మానసిక అనార్యోగమైన, మానసిక చాంచల్యాన్ని కలుగకుండా చూసే బాధ్యత చింతపండుదే.
 
5. మిరియాలు : ఇది కారం గుణం కలిగి ఉంటుంది. ఇవి హయగ్రీవునికి ప్రీతికరమైనవి. వీటితో తలనొప్పి, కండరాలు, నరాల నొప్పులు మాయమవుతాయి. చిటికెడు మిరియాల పొడి జీర్ణక్రియ సమస్యలను పటాపంచలు చేస్తుంది. ఇవి మొటిమలు తగ్గేందుకు, యాంటీ బయోటిక్‌గానే కాదు.. శరీరంలో ఉండే అధిక వేడికి మిరియాలు చక్కని ఔషధంగా పనిచేస్తాయి. ఆలోచనాశక్తిని కూడా పెంపొందిస్తాయి. 
 
6. ఉప్పు: ఈ లవణం రవి, చంద్రుల లక్షణాలను కలిగి ఉంటుంది. రవి ఆరోగ్యానికి, చంద్రుడు మనః శాంతికి కారణం అవుతాయి. కాబట్టి మానసిక అనారోగ్యాన్ని తొలగించడానికి, శారీరక రుగ్మతలను తగ్గించడానికి ఈ రెండూ ఎంతగానో సహకరిస్తాయి. అంతేకాదు ఉప్పు లక్ష్మీ స్వరూపం. అక్షయతృతీయ రోజున బంగారం కొనలేని వారు కనీసం ఉప్పు అయినా కొనమని పండితులు అంటారు. అందుకే ఈ షడ్రుచుల సమ్మేళనంలో ఉప్పూ ఓ భాగమైంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: వైఎస్ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు

అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి భూమిపూజ.. ఎక్కడినుంచైనా గెలుస్తా! (video)

stray dogs ఆ 3 లక్షల వీధి కుక్కల్ని చంపేస్తారా? బోరుమని ఏడ్చిన నటి సదా (video)

ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదికి పోటెత్తిన వరద, బుడమేరు పరిస్థితి ఏంటి? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

shravan masam, శ్రావణ మాసంలో ఆడవారి ఆటలు చూడండి (video)

11-08-2025 సోమవారం ఫలితాలు - సంతోషకరమైన వార్తలు వింటారు...

10-08-2025 బుధవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు....

Karma and Rebirth: కర్మకు పునర్జన్మకు లింకుందా.. గరుడ పురాణం ఏం చెప్తోంది..!

raksha bandhan 2025: రాఖీ కట్టుకున్న తర్వాత ఎప్పుడు తీయాలి? ఎక్కడ పడవేయాలి?

తర్వాతి కథనం
Show comments