Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమజ్జయంతి రోజున ఇలా పూజ చేస్తే..?

హనుమాన్ జయంతిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి, కృష్ణ పక్షంలో జరుపుకుంటారు. ఈ ఏడాది మే 10వ తేదీన (గురువారం) హనుమజ్జయంతి వస్తోంది. ఈ రోజున యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆకు పూజ జరుగుతుంది.

Webdunia
బుధవారం, 9 మే 2018 (18:14 IST)
హనుమాన్ జయంతిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి, కృష్ణ పక్షంలో జరుపుకుంటారు. ఈ ఏడాది మే 10వ తేదీన (గురువారం) హనుమజ్జయంతి వస్తోంది. ఈ రోజున యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆకు పూజ జరుగుతుంది.


భారీ సంఖ్యలో భక్తులు 41 రోజుల పాటు దీక్ష పాటించి స్వామిని దర్శించుకుంటారు. అలాగే ఆంజనేయ స్వామి ఆలయాల్లో లక్ష పత్ర పూజ జరుపుతారు. ఈ పూజలో పాల్గొనే వారికి.. ముందుండి నిర్వహించే వారికి సకల శుభాలు చేకూరుతాయి. 
 
అలాగే హనుమజ్జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపమెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. హనుమజ్జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపమెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
ఇంకా సమీపంలోని హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం, హనుమత్కకళ్యాణం జరిపే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజ చేసే భక్తులు, పూజా మందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. 
 
పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు. పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము, హనుమచ్చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా "ఓం ఆంజనేయాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. 
 
పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. ఇంకా అరగొండ, పొన్నూరు, కసాపురం, గండిక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇదే రోజున హనుమాన్ ధ్యానశ్లోకములు, హనుమాన్‌చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

06-07-2025 నుంచి 12-07-2025 వరకు మీ వార రాశిఫలాలు

తొలి ఏకాదశి జూలై 6, ఓం నమోః నారాయణాయ

తర్వాతి కథనం
Show comments