Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంతి, చేమంతి, తంగేడు పువ్వులతో బతుకమ్మ..

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (14:36 IST)
తెలంగాణలో సుప్రసిద్ధ పండుగ అయిన బతుకమ్మను రోజూ ఆడుతారు. బతుకమ్మ పూజల సందర్భాన్ని పురస్కరించుకుని ఆడపడుచులు పుట్టింటికి వెళ్ళడం ఆనవాయితీగా వస్తోంది. ఐదు రకాల పువ్వులతో అందంగా తయారైన బతుకమ్మకు పూజలు చేస్తారు. 
 
బంతి, చేమంతి వంటి పుష్పాలతో బతుకమ్మను అందంగా తయారుచేస్తారు. ముఖ్యంగా తంగేడు, గునగ పూలు, ఆకులను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఒక విశాలమైన పళ్ళెంలో రంగురంగుల పూలను ఒక క్రమపద్ధతిలో పేరుస్తారు. 
 
ఏ రోజుకు ఆ రోజు బతుకమ్మను అలంకరించి నిమజ్జనం చేస్తారు. అన్ని రోజులూ బతుకమ్మ ఆడటం కుదరని వారు.. దుర్గాష్టమి రోజున తప్పకుండా బతుకమ్మ ఆడుతారు. 
 
ఆపై బతుకమ్మను దగ్గర్లోని చెరువు లేదా నదిలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ నిమజ్జనం తర్వాత దసరా పండుగ జరుపుకుంటారు. 
 
పసుపుముద్దతో రూపొందించిన గౌరీదేవిని కూడా పళ్ళెంలో ఉంచుతారు. ఈ బతుకమ్మను పూజామందిరంలో ఉంచి పూజ చేసిన తర్వాత వెలుపల ఖాళీ ప్రదేశంలో వుంచి ఆ బతుకమ్మల చుట్టూ మహిళలు ఆడుతారు. 
 
పేలపిండి, బెల్లం, పిండివంటలతో కూడిన వాయనాలను ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలా బతుకమ్మ పండగను ప్రతీ ఏటా జరుపుకునే వారికి దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

24-07-2025 గురువారం దినఫలితాలు - పిల్లల దూకుడు అదుపు చేయండి...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య నాడు జ్యోతిష్యం ప్రకారం ఈ యోగాలు

జూలై 23న మాస శివరాత్రి.. ఆరుద్ర నక్షత్రం తోడైంది.. సాయంత్రం శివాలయంలో?

23-07-2025 బుధవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య 2025: వ్రత కథ.. పితృదేవతలకు తర్పణం ఇవ్వకపోతే?

తర్వాతి కథనం
Show comments