Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించడం ఎలాగో తెలుసా!?

Webdunia
FILE
అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తే సకల సంపదలు చేకూరుతాయి. శ్రీకృష్ణ భగవానుడు అనంత పద్మనాభ వ్రతాన్ని ధర్మరాజుకు వినిపించినట్లు పురాణాలు చెబుతున్నాయి. భాద్రపద శుక్ల చతుర్ధశి నాడు (ఈ ఏడాది సెప్టెంబర్-22) శుచిగా స్నానమాచరించి, గృహాన్ని, పూజామందిరాన్ని శుభ్రపరుచుకోవాలి.

పూజామందిరము నందు అష్టదశ పద్మాన్ని తీర్చిదిద్దాలి. ఆ పద్మం చుట్టూ రంగవల్లికలతో అలంకరించుకోవాలి. దానికి దక్షణ భాగంలో నీరు నింపిన కలశం ఉంచాలి.

పద్మానికి నడుమ దర్భలతో తయారు చేసిన ఏడు పడగలతో ఉన్న అనంత పద్మనాభ స్వామి బొమ్మను పెట్టాలి. దర్భలతో చేసిన ఆ బొమ్మలోకి అనంత పద్మనాభ స్వామిని ఆవాహన చేయాలి. ఎర్రని రంగులో ఉండే 14 ముడులతో ఉన్న తోరాన్ని స్వామి దగ్గర ఉంచాలి. షోడశోపచార పూజ చేయాలని పురోహితులు చెబుతున్నారు.

ఇలా పద్మనాభ వ్రతాన్ని ఆచరించే వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఈ వ్రతమహిమతో కృతయుగంలో సుశీల-కౌండిన్య దంపతుల సకల సంపదలు, సుఖసంతోషాలతో జీవించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

ఇంకా అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించిన భక్తులు ఆ రోజున తమకు వీలైనంత దానధర్మాలు చేయడం ద్వార మోక్షఫలములు, పుణ్యఫలములు, అష్టైశ్వర్యాలు పొందుతారని పురోహితులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భీమవరం బుల్లోడు బ్రిటన్ ఉప మేయర్ అయ్యాడు.. ఎలా?

అతివేగంగా చెట్టును ఢీకొట్టిన కారు రెండు ముక్కలైంది: ముగ్గురు మృతి

ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు... క్రమంగా పెరుగుతున్న కేసులు!!

పెళ్లాడుతానని తరచూ నాపై అత్యాచారం చేసాడు: కన్నడ నటుడు మనుపై సహ నటి ఫిర్యాదు

మీ పోస్టుల్లో ఎలాంటి భాష వాడారో మాకు అర్థం కాదనుకుంటున్నారా? సజ్జలపై సుప్రీం ఫైర్

అన్నీ చూడండి

లేటెస్ట్

20-05-2025 మంగళవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

TTD: శ్రీవారికి రెండు భారీ వెండి అఖండ దీపాలను కానుకగా ఇచ్చిన మైసూర్ రాజమాత

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

Show comments