Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్షయ తృతీయ... లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయాలి!?

Webdunia
గురువారం, 1 మే 2014 (18:54 IST)
WD
అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కుబేర లక్ష్మీ పూజ చేయాలని పండితులు అంటున్నారు. కాబట్టి సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి పూజామందిరమును శుభ్రపరచి, దేవుని పటాలకు పసుపు కుంకుమలు, పువ్వులతో అలంకరించుకోవాలి.

ఆ తర్వాత దీపాలను కూడా పసుపు, కుంకుమలు, పువ్వులతో అలంకరించుకుని దీపాలు వెలిగించుకోవాలి. పూజామందిరాన్ని అందంగా రంగవల్లికలతో తీర్చిదిద్దుకోవాలి. అనంతరం రంగవల్లికపై ఓ పీటను ఏర్పాటు చేసి దాని కింద పసుపు, బియ్యం, నాణేలు పెట్టాలి. ఈ విధంగా కలశం ఏర్పాటు చేసుకోవాలి. కలశానికి ముందు అరటి ఆకును వేసి బియ్యాన్ని వేసి దానిపై వెలిగించిన దీపాన్ని ఉంచాలి. పసుపులో వినాయకుడిని చేసి.. దానికి కుంకుమ, పువ్వులు పెట్టుకోవాలి.

కొత్త వస్త్రాలు, బంగారం వుంటే కలశానికి ముందు పెట్టాలి. చక్కెర పొంగలి, పాలతో పాయసం నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇలా పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలుంటాయి.

అక్షయ తృతీయ నాడు (మే 2) మనం చేసే దానాలు మంచి ఫలితాలనిస్తాయి. ముఖ్యంగా సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం లభించడంతో పాటు సత్ఫలితాలు చేకూరుతాయి. ఇంకా అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి పటానికి ముందు నేతి దీపమెలిగించి లక్ష్మీస్తుతి చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments