Webdunia - Bharat's app for daily news and videos

Install App

గడియారాలను గిఫ్ట్‌గా ఇస్తున్నారా? జాగ్రత్త!!

Webdunia
గురువారం, 5 జూన్ 2014 (16:46 IST)
ఆగిపోయిన, పనిచెయ్యని గడియారాలను ఇంట్లో వుంచకూడదని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో శుభకరమైన శక్తిని నింపడానికి గడియారాలనే ఫెంగ్‌షుయ్ నిపుణులు సిఫార్సు చేస్తారు. ఎందుకంటే..? గడియారంలో ముళ్ళు లేదా పెండ్యూలయం లయబద్ధంగా కదులుతూ.. చీ శక్తిని ఇంటి నిండా నింపుతుందని చైనా ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. 
 
అలాంటి గడియారాలను మీ ఇంటి హాలుకు ఎడమవైపు లేదా ముందుగోడకి తగిలించడం మంచిదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. అయితే గడియారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి ముఖద్వారానికి ఎదురుగా ఉంచకూడదని వారు చెబుతున్నారు.
 
అలాగే పెళ్ళిళ్లకు, ఇతర వేడుకల్లో గడియారాలను బహుమతిగా ఇస్తుండటం పరిపాటి. కాని గడియారాలను బహుమతిగా స్వీకరించడమో లేదా బహుమతిగా ఇవ్వడమే కూడదని ఫెంగ్‌షుయ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గడియారాలను బహుమతి తీసుకోవడం, ఇవ్వడం ద్వారా అశుభ ఫలితాలు చేకూరుతాయని వారు సూచిస్తున్నారు. 
 
అందుచేత గడియారాలను మీరు స్వయంగా కొనుక్కొని ఇంట్లో ఉంచుకోండి. ఇతరులు గడియారాలను బహుమతిగా ఇస్తే సున్నితంగా వారించడం మంచిదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

Show comments