పెయింట్ కొడుతున్నారా? అయితే నలుపు రంగు వాడొద్దు!

Webdunia
శనివారం, 31 మే 2014 (13:29 IST)
మీ గృహానికి పెయింట్ కొడుతున్నారా..? అయితే నలుపు రంగును ఎక్కడా వాడకండని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. నలుపు రంగు నీటికి చిహ్నం అయినప్పటికీ.. దీనిని ఎక్కువగా వాడకూడదని వారు సూచిస్తున్నారు. 
 
ముఖ్యంగా ఇంటి పైకప్పుల మీద, దూలాలకు ఈ రంగును పొరబాటున కూడా వాడకూడదని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. ఇంకా నలుపు రంగును గృహానికి వేయించే పెయింట్‌లో ఎక్కడా వాడకుండా ఉండటమే మంచిది.
 
కానీ దూలాలకు, పైకప్పులకు తెలుపు రంగును వాడటం ద్వారా వ్యాపారంలో అభివృద్ధి ఉంటుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. అలాగే గృహంలో పడమర దిక్కున తెలుపు రంగుతో కూడిన పోస్టర్లును తగిలిస్తే కుటుంబ సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. 
 
ఇక ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను మీ గృహంలోని దక్షిణ, ఆగ్నేయ, ఈశాన్య దిశల్లో ఉపయోగించడం ద్వారా అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని వాస్తునిపుణులు అంటున్నారు. ఇందులో ఎరుపు రంగు దక్షిణానికి చిహ్నం. ఇంకా రాబడికి ప్రతి రూపం ఇది. అందువల్ల దక్షిణం వైపు ఎరుపు రంగు పోస్టర్లు, కర్టెన్‌లు, కార్పెట్‌లు వుంచితే లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఆర్థిక సమస్యలు సమసిపోతాయి. 
 
ఆగ్నేయానికి చిహ్నం అయిన ఆకుపచ్చ రంగు సంపదకి ప్రతిరూపం. ఇదే రంగు తూర్పువైపు కూడా వేయిస్తే శుభఫలితాలుంటాయి. అందువల్ల రంగు రంగుల పూల మొక్కల కుండీలను ఆగ్నేయ, తూర్పు దిశల్లో వుంచడం ద్వారా సంపద పెరుగుతుంది. ఇకపోతే.. నీలం రంగును ఉత్తరం వైపు, ఈశాన్యం వైపు ఉంచడం వల్ల మంచి ఫలికాలు చేకూరుతాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కబడ్డీ టోర్నీలో పందెం కాసి చిక్కుల్లోపడిన కర్నాటక మంత్రి.. కేసు నమోదుకు కోర్టు ఆదేశం

ఇరాన్ నుంచి భారతీయులు తక్షణమే వీడండి: భారత ప్రభుత్వం హెచ్చరిక

హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై దాడి చేసిన ఇరాన్

ఓటమి అంచున ఉన్నవారు షరతులు విధించలేరు : ట్రంప్ కాల్పుల విమరణ పొడగింపుపై ఇరాన్ కామెంట్స్

హోమ్ స్టేలో బస చేసిన మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. ఇద్దరి అరెస్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

19-04-2026 ఆదివారం ఫలితాలు : ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు...

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున అద్భుత కలయిక.. ఉప్పు, గవ్వలతో ఇలా చేస్తే?

Simhadri Appanna: అక్షయ తృతీయ నాడే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. చందనోత్సవం

Parashurama Jayanti 2026: ప్రదోష కాలంలో జన్మించిన పరశురాముడు.. పూజ ఇలా చేస్తే?

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున శని, రాహు దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి..?

Show comments