పరనింద.. దూషణపై ఫెంగ్‌షుయ్ ఏం చెబుతుందంటే...

Webdunia
గురువారం, 3 జులై 2014 (13:04 IST)
చైనా వాస్తు శాస్త్రం ఫెంగ్‌షుయ్ ప్రకారం ఇతరులను దూషించడం మంచిది కాదు. కోపం, విచారం, ఈర్ష్య, ద్వేషం లాంటివి ఫెంగ్‌షుయ్ ప్రకారం ఉండకూడదని నిపుణులు అంటున్నారు. కొంతమందికి ఇతరుల గురించి చెడుగా మాట్లాడే స్వభావం ఉంటుంది. అలాగే ఇంకొంత మందికి ఎదుటివారిని గురించి ఫిర్యాదు చేసే స్వభావముంటుంది. 
 
మరికొందరైతే ఇతరులను సులభంగా నిందించడానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు.. ఇతరులు ఉన్నతస్థితికి ఎదుగుతుంటే విచారంలో కుళ్ళిపోయేవాళ్ళూ చాలా మంది ఉంటారు. ఇలాంటి వ్యతిరేక భావాలను దూరంగా ఉంచడం మంచిదని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. ఈ భావాలు మనలో ఉంటే, అవి ఇంటి నిండా ప్రతికూల శక్తిని సృష్టిస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. 
 
ఎపుడైతే  మనిషి సంతోషంగా, హృదయ నిర్మలంగా ఉంటుందో... అన్ని అనుకూలంగా సాగుతాయని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. మన హృదయాలు స్వచ్ఛంగా ఉంటే అక్కడ "చీ" శక్తి సైతం ఎంచక్కా ఇంటి నిండా తిరుగుతుంది. ఈ "చీ" ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేని పక్షంలో ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. 
 
అందుకే మీ పిల్లల మీద, శ్రీమతి లేదా శ్రీవారి మీద అకారణంగా అరవకండి. ఆగ్రహాన్ని తగ్గించుకుని వీలైనంతవరకు మృదువుగా మాట్లాడడం చేస్తే "చీ" శక్తి సకల సంతోషాలనిస్తుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెబుతున్నారు. అలాకాకుండా మీరు కోపంగా, ఆగ్రహంతో ఉంటే ఇంట్లో చెడ్డ చీ శక్తి తిరుగుతూ, సమస్యలకు నిలయమవుతుందని వారు పేర్కొంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్రహ్మంగారి మాటలు నిజమవుతున్నాయా... ఏనుగు పిల్ల ఆకారంలో జన్మనిచ్చిన పంది

విరుదునగర్ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు : 17 మంది మృతి

ప్రధాని మోడీ రాజకీయ ప్రసంగంలో 59 సార్లు కాంగ్రెస్ పేరును ప్రస్తావించారు : ఖర్గే

కుక్కల బారినపడిన మచ్చల జింక - కాపాడి చంపి వండుకుని ఆరగించిన గ్రామస్థులు

ఏప్రిల్ 20న చంద్రబాబు పుట్టినరోజు - రూ.76 లక్షలు విరాళం ఇచ్చిన భువనేశ్వరి

అన్నీ చూడండి

లేటెస్ట్

19-04-2026 నుంచి 25-04-2026 వరకు మీ వార ఫలితాలు

18-04-2026 శనివారం ఫలితాలు - కొన్ని సమస్యల నుంచి బయటపడతారు

Tirumala: పాలకడలిని పోలిన పొగమంచు.. తిరుమలలో అరుదైన దృశ్యం

త్వమేవ మాతా చ పితా త్వమేవ...

17-04-2026 శుక్రవారం ఫలితాలు (అమావాస్య) - పొగిడే వారితో జాగ్రత్త

Show comments