Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఇంట్లో మెట్లకు ఎదురుగా బెడ్‌రూమ్ ఉందా..?!

Webdunia
FILE
మీ గృహంలో మెట్లకింద ఆక్వేరియం, ఫౌంటైన్‌లు ఉన్నాయా..? అయితే వాటిని వెంటనే తొలగించేయండని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు. మెట్ల కింద ఆక్వేరియం లేదా ఫౌంటైన్‌లు ఉంటే మీ పిల్లలు అనారోగ్యానికి గురవుతారని ఫెంగ్‌షుయ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలాగే మెట్ల కింద సామానులు, స్టోర్‌రూమ్‌లు, బాత్‌రూమ్‌లు, లెట్రిన్‌లు ఇలాంటివి ఉండకూడదు. సాధ్యమైనంతవరకు తప్పనిసరిగా మెట్ల పక్కన రెయిలింగ్ లేదా నడిచేందుకు ఆధారంగా ఉండే గోడలాంటిది కట్టాలి. ఇంకా మెట్లకు ఎదురుగా బెడ్‌రూమ్ ఉండరాదు.

ఇంటికి ప్రధాన ద్వారం ఎదురుగా, లేదా హాలులో ప్రవేశించగానే మెట్లు ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల చీ శక్తి ఇంటిలోనికి ప్రవేశించిన వెనువెంటనే హాలులో తిరగకుండానే, ఎదురుగా ఉన్న మెట్లపైకి పోతుంది. దీనివల్ల హాలులోనే కాక మిగతా అన్ని గదులలో కూడా సరిపోయేంత చీ శక్తి లభ్యం కాదు.

ఇలా జరగడం ఆ ఇంట్లో నివసిస్తున్న వారికి అన్ని విధాలా మంచిది కాదు. ఇకపోతే.. ఇంటి మధ్య భాగంలో మెట్లుండరాదు. దీనివల్ల కుటుంబ కలహాలు రావచ్చు. ఉత్తరం లేదా వాయువ్య దశలలో మెట్లుంటే దురదృష్టం వెంటాడుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

లేటెస్ట్

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

Show comments