Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకు మెట్ల కింద నిద్రించే అలవాటుందా..?!

Webdunia
FILE
మీ ఇంట్లో మెట్ల కింద స్థలం ఖాళీగా ఉందా..? ఆ స్థలంలో నిద్రిస్తున్నారా? ఐతే ఆ అలవాటును మార్చుకోండని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు. మెట్ల కింద నిద్రించడం మంచిదికాదంటున్నారు.

మెట్లకు పక్కగా కదిలే ఛీ శక్తిలో సహజంగానే కొద్ది వేగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మెట్లకు దగ్గరగా లేదా క్రిందా, పైనా నిద్రించకూడదని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలున్నాయి. ఇంకా ఆరోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉందని ఫెంగ్‌షుయ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిజానికి మెట్లకు ఎదురుగా పడకగది ఉండకూడదు. ఇంటి మధ్య భాగంలో మెట్లు ఉండకూడదు. దీనివల్ల కుటుంబ కలహాలు తలెత్తే అవకాశం ఉంది. మెట్ల క్రింద ఆక్వేరియం లేదా ఫౌంటేన్‌లను పెట్టకండి. దీనివల్ల మీ పిల్లలు అనారోగ్యానికి గురవుతారు.

ఇకపోతే.. కొన్ని చోట్లలో ముఖ్యంగా అవుట్‌హౌస్‌లలో ఉండే గార్డెన్‌లలో, పార్క్‌ల్లో ఎక్కువ మెలికలు తిరిగిన మెట్లుంటాయి. ఇలాంటివే కొందరు తమ ఇళ్ళల్లో ఆకర్షణీయంగా ఉంటాయని నిర్మించుకుంటారు. దీనివల్ల మనకు లభ్యమవ్వాల్సిన మొత్తం ప్రాణశక్తి అక్కడే నిలిచిపోతుంది. ఫలితంగా పై అంతస్తులో ఉండేవారికి ఎలాంటి వనరులూ లభ్యమయ్యే అవకాశాలుండవు.

అయితే గృహంలో కొద్దిగా వంపు తిరిగిన మెట్లుండటం ఎంతో లాభదాయకం. ఎందుకంటే దీనివల్ల చీ శక్తి మరీ ఉధృతంగాను లేదా నెమ్మదిగా ప్రయాణించకుండా, ఒక సరైన పద్ధతిలో కావాల్సినంత రీతిలో సమపాళ్ళలో ఉంటుంది. తద్వారా ఇంటిపై అంతస్తులోని వారు, క్రింది అంతస్తులోని వారు ఇద్దరూ అన్ని విధాలా అభివృద్ధి చెందే ఆస్కారాలు పెరుగుతాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

లేటెస్ట్

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

Show comments