Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫెంగ్‌షుయ్ ప్రకారం రంగులతో గమ్మత్తు!

Webdunia
వారంలోని ఏడు రోజుల్లో ఏ రోజు ఏ రంగు దుస్తులు వాడాలో మీకు తెలుసా..? ఆదివారం నుంచి శనివారం వరకు ఫెంగ్‌షుయ్ శాస్త్రం పేర్కొన్న రంగుల దుస్తులను ధరిస్తే అష్టైశ్వర్యాలతో పాటు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆ శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఫెంగ్‌షుయ్ తెలిపిన రంగులను వారంలోని ఏడు రోజుల్లో ధరిస్తే, మీకున్న ప్రతికూలతలు తప్పకుండా తొలగిపోగలవు.

ఇందులో భాగంగా.. ఆదివారం నారింజ లేదా బంగారు రంగు దుస్తులు ధరించడం మంచిదని ఫెంగ్‌షుయ్ శాస్త్రం పేర్కొంటోంది. అదే విధంగా.. ధార్మిక సంబంధమైన పనులు చేయాలన్నా, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు, కలిసి కట్టుగా పనిచేయాల్సిన ఇతర పనులను ప్రారంభించే సమయంలో తెల్లని, బంగారు, కొద్దిగా నీలం రంగులున్న దుస్తులను ధరించడం శ్రేయస్కరం. ఇలా చేయడం ద్వారా మీరు ఫలితం దిశగా ముందడుగు వేస్తారని ఫెంగ్‌షుయ్ నిపుణలు చెబుతున్నారు.

ఇకపోతే.. సోమవారం కూడా తెల్లని, నీలి రంగు లేదా వెండి ఛాయ కలిగిన దుస్తులు ధరించడం మంచిది. కాలేజీలకైనా, మీ ఆఫీసులో అయినా క్రమంగా సోమవారాలు అలాంటి డ్రెస్సులే వేసుకుంటే నెమ్మదిగా మీకున్న ఆటంకాలు తొలగిపోతాయి. దీంతో పాటు రెండింతల ఆత్మవిశ్వాసంతో మీకే తెలియని ఉత్సాహంతో పనిచేయగలరని ఫెంగ్‌షుయ్ శాస్త్రం వెల్లడిస్తోంది.

అలాగే మంగళవారం అయితే ఎర్రని లేదా నారింజ రంగులకు దగ్గరగా ఉన్న దుస్తులను ధరించండి. బుధవారం ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం శ్రేష్టమని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

ఇకపోతే గురువారం పసుపుపచ్చ రంగు మెరుగైన ఫలితాలనివ్వగలదు. శుక్రవారం పింక్ లేదా క్రీమ్, లైట్ క్రీమ్ కలర్‌లు ప్రత్యేక ఆకర్షణనిస్తాయి. చివరిగా శనివారం నావీబ్లూ లేదా నల్లని రంగులకు దగ్గరి రంగు దుస్తులు శ్రేయస్కరమని ఫెంగ్‌షుయ్ శాస్త్రం పేర్కొంటుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

తప్పిపోయిన కుక్క, డ్రోన్ కెమేరాతో వెతికి చూసి షాక్ తిన్నారు (video)

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Show comments