Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతులు లేని కుర్చీలు దురదృష్టానికి ప్రతీకట!

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2012 (17:37 IST)
FILE
ఫెంగ్‌షుయ్ ప్రకారం చేతులు లేని కుర్చీలు దురదృష్టానికి ప్రతీకట. ఫెంగ్‌షుయ్ సూత్రాల ప్రకారం మీరు కూర్చునే కుర్చీ, టేబుల్ సైతం అదృష్టాలను ప్రభావితం చేస్తాయి. ముందుగా మీరు కూర్చునే కుర్చీ వెనక సపోర్ట్ ఉండేలా చూసుకోండి. కొన్ని కుర్చీలు కేవలం నడుందాకే వుంటాయి.

అలా గాకుండా మీ వీపు ఆ కుర్చీకి ఆనుకునేలా వెనకాల చెక్క వుండాలి. అలాగే మీరు కూర్చునే కుర్చీలో చేతులు ఉంచుకునేలా అంచులు ఉండాలి. చేతులు లేని కుర్చీలు దురదృష్టానికి ప్రతీక అని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

అలాగే మీ డెస్క్‌కి కాళ్లు డెస్క్ చివర ఉండాలి. కొన్ని డెస్క్ (టేబుళ్ల)కి కాళ్ళు టేబుల్ మధ్యలో ఉండటం చూస్తుంటాం. అలాగాక డెస్క్ లేదా టేబుల్‌కి నాలుగు వైపుల చివర కాళ్ళు ఉంటేనే అదృష్టం దరిచేరుతుందని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది.

మీరు కూర్చునే టేబుల్స్ వెనుక లేదా ముందు గోడలపై పర్వతాలు గల సీనరీలను తగిలించుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే కిటికీల పక్కనే మీ కుర్చీలను ఏర్పాటు చేసుకోవడం కూడదు. కిటీకీల దగ్గరే కుర్చీలను ఏర్పాటు చేసి కూర్చోవడం ద్వారా మానసిక ఒత్తిడి పెరుగుతుందని, ఆత్మవిశ్వాసం లోపిస్తుందని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

లేటెస్ట్

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

Show comments