Webdunia - Bharat's app for daily news and videos

Install App

గృహాలకు ఫెంగ్‌షుయ్ రంగుల ప్రభావం

Webdunia
భారతీయులు అధికంగా నమ్మే వాస్తు శాస్త్రాల్లో ఫెంగ్‌షుయ్ కూడా ఒకటి. దీని ఆచరించటం ద్వారా జీవన గమనంలో మార్పులు సంభవిస్తాయని శాస్త్రజ్ఞులు అంటున్నారు. తదనుగుణంగానే ఈ శాస్త్రం భారతీయులకు నిత్యజీవన సూత్రంగా మారింది.

ఈ శాస్త్రం ప్రకారం గృహాలు, ఆస్తులు, వస్తువులు, జీవనం ఎలా సాగించాలనే అంశాలపై వివిధ రీతుల్లో వర్ణించటం జరిగింది. అందులో ప్రధానంగా మానవుడి జీవితంలో రంగుల ప్రభావం ఎలావుంటుంది. పెంగ్‌షుయీ శాస్త్రం ప్రకారం గృహాలకు ఎటువంటి రంగులను ఉపయోగిస్తే శుభఫలితాలను అందిస్తాయి. మనుషుల ప్రవర్తన, ఆలోచన, భావోద్వేగాలపై రంగుల ప్రభావం అధికంగా ఉంటుందని పెంగ్‌షుయ్ వివరిస్తుంది.

ఈ శాస్త్ర ప్రకారం ఏయే రంగుల ప్రభావం ఎలా ఉంటుదనే వివరాల్లోకి వెళితే.. అన్ని రంగుల్లోకెళ్లా కొట్టొచ్చేలా కనిపించేది ఎరుపు. దీనిని గృహాలకు మితంగా వాడితే మంచిది. పడక గదులకు పూర్తిగా ఉపయోగించకూడదు. ఇక పసుపు రంగును మేధస్సుకు, పరిణతికి చిహ్నంగా కొలుస్తారు. ఈ రంగును వంటగది, సిటింగ్ రూమ్‌లకు వాడితే బాగుంటుంది.

గోధుమ రంగు విషయానికి వస్తే ఇది స్థిరత్వమున్నది కాబట్టి ప్లోరింగ్‌కే పరిమితం చేయాలి. బంగారు, వెండి రంగులు ఇవి రెండూ ధనం, సంపదను సూచించే రంగులు. అందువల్ల దేవుడి గది. అధికంగా సంచారంలేని విశాల గదులకు వేయవచ్చు. బూడిద, తెలుపు రంగులు ఎక్కడైతే దృష్టి కేంద్రీకరణం అవసరమో అక్కడ ఈ రంగులు వాడుకోవచ్చు.

నీలం, వంకాయ రంగులు ఇవి విశ్రాంతికి సూచికలు. అందువల్ల బెడ్‌రూమ్, ఇతర విశ్రాంతి మందిరాల్లో కనిపించేలా వాడుకోవాలి. ఆకుపచ్చ రంగు వృద్దికి చిహ్నం. దీనిని బయటి గోడలకు వేయవచ్చు. గులాబీరంగు సిటింగ్ రూమ్‌లకు వేస్తే బాగుంటాయి. నలుపు రంగు జీవితంపై తీవ్ర ప్రభావం చూపే రంగు. అందువల్ల దీనిని ఎవ్వరు సంచరించని ప్రాంతాల్లో మాత్రమే ఉపయోగించుకోవాలని ఫెంగ్‌షుయ్ పేర్కొంటుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

లేటెస్ట్

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

Show comments