వీకెండ్ స్పెషల్ : హెల్దీ మష్రుమ్.. ఎగ్ ఫ్రైడ్ రైస్!

Webdunia
శనివారం, 22 నవంబరు 2014 (18:56 IST)
న్యూట్రీషన్ విలువలు గొప్పగా ఉండే మష్రుమ్.. కోడిగుడ్డుతో ఈ వీకెండ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేద్దాం.. మష్రూమ్, ఎగ్స్ తీసుకోవడం ద్వారా డయాబెటిస్, ఎముకల సంబంధిత రోగాలను దూరం చేయడం లాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే మష్రుమ్.. ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్టీగా ఉండటం ద్వారా పిల్లలు, పెద్దలు ఇష్టపడి తింటారు. 
 
కావలసిన పదార్థాలు: 
మష్రూమ్స్ :  ఒక కప్పు
అన్నం: రెండు కప్పులు 
తరిగిన ఉల్లిపాయలు: ఒక కప్పు 
టమేటో తరుగు : అరకప్పు 
గుడ్లు : రెండు 
కొత్తిమీర తరుగు: అర కప్పు 
కారం: ఒక టీ స్పూన్ 
నిమ్మరసం: ఒక టీ స్పూన్ 
ఉప్పు: రుచికి తగినంత
నూనె: తగినంత 
అల్లం వెల్లుల్లి పేస్టు: రెండు టీ స్పూన్లు 
 
తయారీ విధానం :  
ముందుగా పాన్‌లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేపుకోవాలి. తర్వాత మష్రూమ్స్ ముక్కల్ని చేర్చి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. అందులోనే కారం, జీరా, ధనియా పొడులు, చాట్ మసాల, కొత్తిమీర, ఉప్పు రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
 
తర్వాత గుడ్డు సొన వేయాలి. గుడ్డు పొడిపొడిగా అయ్యాక అన్నం బాగా మిక్స్ చేయాలి. చివరిగా నిమ్మరసం చిలకరించి మరోసారి మిక్స్ చేస్తే మష్రుమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ రైస్‌ను వేడి వేడిగా మీకు నచ్చిన సాస్ లేదా కడాయ్ చికెన్.. పనీర్ బటర్ మసాలాతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Heat Dome, ఉడికిపోతున్న ఫ్రాన్స్, ఏసీల కోసం ఎగబడుతున్న జనం, వీడియో

ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జన నాయగన్ నిర్మాత

మిత్ర వాట్సాప్ యాప్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలి... నారా లోకేష్

నేనే గోల్డ్‌మేన్ అంటూ ఎగిరిపడ్డ సూర్య అరెస్ట్, ఎందుకంటే?

అతడు ఓ అనుమానపు పురుగు, పక్కా ప్రణాళికతోనే నా కుమార్తెను హత్య చేసాడు: రాధాగాయత్రి తండ్రి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖుష్బూ కుమార్తె పెళ్లికి త్రిష, ఖాళీగా పక్కసీటు, అది ఎవరికోసం?

Sree Vishnu: ఫస్ట్ 25 టికెట్స్ ఎవరు కొంటే వారికి మరొక టికెట్ ఫ్రీ ఇస్తాం :శ్రీవిష్ణు

Kajal Aggarwal :పురుగు మందుల పేరుతో జరిగే అన్యాయాలపై లాయర్ పోరాటమే ది ఇండియా స్టోరీ

Aishwarya Rajesh :ఇసకపట్నం పై ఆధిపత్యం చేసే సముద్రఖని కి సవాల్ గా మారిన ఐశ్వర్య రాజేష్

Tatvam trailer: మర్డర్ మిస్టరీ, ఇన్వస్టిగేషన్‌ థ్రిల్లర్‌ గా తత్వం ట్రైలర్‌

Show comments