Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు హెల్దీ స్నాక్: పనీర్‌ టిక్కా ఎలా చేయాలి?

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (19:01 IST)
పిల్లలకు హెల్దీ స్నాక్ ఇంట్లోనే తయారు చేయాలంటే పనీర్ టిక్కా ట్రై చేయండి. 
 
కావలసిన వస్తువులు:
పనీర్‌ :  200 గ్రాములు 
గట్టిగా ఉండే పెరుగు : నాలుగు టేబుల్ స్పూన్లు 
కారం : ఒక టీ స్పూను.
ఉప్పు : తగినంత 
నూనె : తగినంత 
వెల్లుల్లి పేస్ట్‌ : అర టీ స్పూను.
ఫుడ్‌ కలర్‌(రెడ్‌): చిటికెడు.
చిల్లీ సాస్‌ : ఒక టేబుల్‌ స్పూను.
నిమ్మకాయ : చిన్న ముక్క.
చాట్‌, గరం మసాల పౌడర్‌ : చెరో అర టీ స్పూన్
 
తయారీ విధానం : 
పనీర్‌ను వెడల్పాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో పెరుగు, కారం, ఉప్పు, ఒక స్పూన్ నూనె, వెల్లుల్లి పేస్ట్, కలర్, సాస్ నిమ్మరసం, చాట్, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. పనీర్ ముక్కలకు ఈ మసాలా పట్టించి, ముక్కలు కట్ కాకుండా 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. 
 
మసాలా పట్టించిన పనీర్‌ ముక్కలను ఒవెన్‌లో బేక్‌ చేయాలి. ఒవెన్‌ లేకుంటే బాణలిలో నూనె పోసి దోరగా వేయించుకోవాలి. వీటిని సర్వింగ్‌ బౌల్‌లోకి తీసి వెజిటబుల్‌ సలాడ్‌ కోసం వాడే అన్ని రకాల ముక్కలతోనూ గార్నిష్‌ చేసుకోవచ్చు. అంతే పిల్లల ఇష్టపడి తింటారు. 

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

Show comments