"కోకోనట్ సమోసా" ఎలా తయారు చేస్తారు?

Webdunia
గురువారం, 4 సెప్టెంబరు 2014 (14:49 IST)
కావలసిన పదార్థాలు :
మైదా పిండి.. నాలుగు కప్పులు
నెయ్యి... నాలుగు టీ.
వాము.. రెండు టీ.
ఉప్పు, నూనె.. తగినంత
 
సమోసాల్లో నింపేందుకు..
కొబ్బరితురుము, నువ్వులు.. ఒక్కో కప్పు చొప్పున
కారం, ధనియాలపొడి, సోంపు.. తలా రెండు టీ.
ఇంగువ.. అర టీ.
ఉప్పు.. తగినంత
 
తయారీ విధానం :
ముందుగా మైదా పిండికి వాము, తగినంత ఉప్పు చేర్చి చపాతీ పిండిలా కలిపి ఓ అర్థగంట నానబెట్టాలి. బాణలిలో కొద్దిగా నెయ్యి వేడిచేసి కొబ్బరి తురుము, నువ్వులను విడి విడిగా వేయించి ఉంచాలి. నువ్వులు చల్లారిన తర్వాత పొడిచేసి ఉంచాలి. ఇప్పుడు నువ్వులపొడి, కొబ్బరి తురుము, సోంపు, వాము, ధనియాలపొడి, ఇంగువ, కారంపొడిలను ఒక పాత్రలో వేసి బాగా కలియబెట్టాలి. మైదాను చిన్న చిన్న పూరీల్లా చేసి చాకుతో రెండు భాగాలుగా కోయాలి.
 
ఒక్కోదాంట్లో పై పొడి మిశ్రమాన్ని మూడు టీస్పూన్లు వేసి నీటితో తడుపుతూ చివర్లు సమోసా షేప్‌లో మూసివేయాలి. అలా మొత్తం పిండినంతా చేసుకుని బాగా మరుగుతున్న నూనెలో వేసి బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి న్యూస్‌ పేపర్‌పై పరవాలి. అంతే వేడి వేడి కొబ్బరి సమోసాలు తయార్. వీటిని వేడిగా ఉన్నప్పుడే టొమోటో సాస్ లేదా చింతపండు సాస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది కూడా.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్ళికి నిరాకరించిన యువతి.. కత్తితో పొడిచిన యువకుడు.. చివరకు నాటు బాంబు పేలి...

28-06-2026 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వెదర్ రిపోర్ట్- 33 జిల్లాలకు భారీ వర్ష సూచన

తిరుపతి విమానాశ్రయం మినహా బార్లు, మద్యం దుకాణాలు.. ఏపీ మార్గదర్శకాలు

ఉత్తర భారతదేశంలో కంపించిన భూమి... ఆప్ఘనిస్థాన్ ఎఫెక్ట్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

మలయాళ స్టార్ హీరో నివీన్ పాలీ కొత్త సినిమాకు విజయం టైటిల్ ఖరారు

అవి ఐటమ్ సాంగ్‌లు కాదు... ప్రత్యేక డ్యాన్స్ నంబర్లే : తమన్నా

మరోమారు సందడి చేయనున్న పుష్ప రాజ్ - శ్రీవల్లి జోడీ

Show comments