హెల్దీ బ్రేక్ ఫాస్ట్ : వెజిటబుల్ కట్‌‌లెట్!

Webdunia
సోమవారం, 27 అక్టోబరు 2014 (16:12 IST)
హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలా? అయితే తాజా కాయగూరలతో వెజిటబుల్ కట్‌‌లెట్ ట్రై చేయండి. కాయగూరల్లో ఆంటియాక్సిడెంట్లు, వ్యాధినిరోధక శక్తి పుష్కలంగా ఉండటంతో బరువును నియంత్రిస్తాయి. అంతేగాకుండా ఒబిసిటీని దూరం చేస్తాయి. అందుచేత కూరగాయలతో కట్‌లెట్స్ ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు : 
బంగాళాదుంపలు : మూడు 
ఉడికించిన క్యారెట్, బఠాణీలు, పనీర్, ఉల్లిపాయలు : తలా అరకప్పు 
బ్రెడ్ పొడి : ఒకటిన్నర కప్పు
కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు: ఒక టీస్పూన్ 
గరంమసాలా : అర టీస్పూన్ 
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : చెరో స్పూన్ 
ఉప్పు, నూనె : తగినంత 
 
తయారీ విధానం: 
ఉడికించిన బంగాళాదుంపలు, బఠాణీలు, క్యారెట్లను చిదమాలి. పనీర్ వేసి బాగా కలియబెట్టాలి. మూకుడు వేడిచేసి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఉల్లిపాయల్ని దోరగా వేయించాలి. మసాలా దినుసుల్ని కలిపి, పచ్చిమిర్చి తరుగును వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బంగాళాదుంపలకు చేర్చాలి. అరకప్పు బ్రెడ్‌‍పొడి వేసి బాగా కలిపి, అరచేతిలో ఫ్లాట్‌గా నొక్కుకోవాలి. మిగతా బ్రెడ్ పొడిలో అద్ది కట్‌లెట్‌ను అద్ది.. రెండు వైపులా వేడిచేసిన నూనెలో దోరగా వేయించుకుని టమోటా సాస్‌తో సర్వ్ చేస్తే వెజ్ కట్ లేట్ రెడీ. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉత్తర భారతదేశంలో కంపించిన భూమి... ఆప్ఘనిస్థాన్ ఎఫెక్ట్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

రాజధాని అమరావతిపై ఏపీ ప్రజల భావన మారాలి.. చంద్రబాబు

పెళ్ళయి నెలకే గుట్టపై నుంచి పడి నవ వధువు మృతి

రౌడీయిజం - దౌర్జన్యం చేయడానికే వైకాపా నేతల అమరావతి యాత్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి ఐటమ్ సాంగ్‌లు కాదు... ప్రత్యేక డ్యాన్స్ నంబర్లే : తమన్నా

మరోమారు సందడి చేయనున్న పుష్ప రాజ్ - శ్రీవల్లి జోడీ

మొన్ననే గోవాలో కలిశాను... ఆప్యాయంగా మాట్లాడారు : భాగ్యరాజ్ మృతిపై చిరంజీవి

తమిళ దిగ్గజ నటుడు కె.భాగ్యరాజ్య ఎలా చనిపోయారంటే...?

ఖుష్బూ సుందర్ కుమార్తె పెళ్లికి వెళ్లొచ్చారు.. గుండెపోటుతో భాగ్యరాజ్ కన్నుమూత (video)

Show comments