ఫిష్ టిక్కా ఎలా చేయాలి?

ఓ వెడల్పాటి పాత్రలో పెరుగు, ఆవాల పొడి, ఉప్పు, జీలకర్రపొడి, మిరియాల పొడి, పసుపు, వెనిగర్, అల్లం వెల్లుల్లి ముద్దను బాగా మిక్స్ చేయాలి. ఇందులో ముళ్లు లేని శుభ్రం చేసిన చేప ముక్కలకు పట్టించి.. అరగంట పాటు

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2017 (12:41 IST)
చేపల్లో ప్రోటీన్లు పుష్కలంగా వుంటాయి. తద్వారా గుండెపోటు హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చు. మెదడుకు మేలు చేసే చేపలు వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. టైప్-1 డయాబెటిస్‌, పిల్లల్లో ఆస్తమాను చేపలు దరిచేరనివ్వవు. నిద్రలేమికి చెక్ పెట్టవచ్చు. అలాంటి చేపలతో కూర, ఫ్రై చేసి బోర్ కొట్టేసిందా.. అయితే ఈసారి ఫిష్ టిక్కా ట్రై చేయండి. 
 
కావలసిన పదార్థాలు : 
చేపల ముక్కలు : అర కేజీ 
పెరుగు- ఒక కప్పు 
ఆవాల పొడి - రెండు టీ స్పూన్లు 
ఉప్పు - తగినంత  
జీలకర్ర పొడి - ఒక టీ స్పూన్ 
కారం పొడి - ఒక టీ స్పూన్ 
మిరియాల పొడి- ఒక టీ స్పూన్  
పసుపు పొడి - అర స్పూన్ 
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్  
నూనె- తగినంత 
వెనిగర్ - అర స్పూన్ 
 
తయారీ విధానం :
ఓ వెడల్పాటి పాత్రలో పెరుగు, ఆవాల పొడి, ఉప్పు, జీలకర్రపొడి, మిరియాల పొడి, పసుపు, వెనిగర్, అల్లం వెల్లుల్లి ముద్దను బాగా మిక్స్ చేయాలి. ఇందులో ముళ్లు లేని శుభ్రం చేసిన చేప ముక్కలకు పట్టించి.. అరగంట పాటు పక్కనబెట్టేయాలి. ఆపై బాణలిలో నూనె పోసి వేడయ్యాక అందులో మసాలా దట్టించిన చేప ముక్కలను స్క్యూవర్ కమ్మీలకు గుచ్చి.. ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి. ఈ ముక్కలు ఉడికి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఆపై సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని గ్రీన్ చట్నీతో రుచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎమ్మెల్యే శ్రీధర్ ఇదివరకు వైసీపికి చెందినవారే, ఇప్పుడు జనసేన అంతే: బాధితురాలు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్‌‍కు సిట్ నోటీసులు?

శ్రీవారి లడ్డూలులో కల్తీ నెయ్యి నిజమేనంటూ సిట్ సంచలన విషయాలు

Tirupati laddu: లడ్డూలో ఆ కొవ్వు లేదు.. చంద్రబాబు నేలపై ముక్కు రాసి క్షమాపణ చెప్పాలి

మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలు: అజ్ఞాతంలోకి అరవ శ్రీధర్, ఫోన్ స్విచాఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓం శాంతి శాంతి శాంతిః రీమేక్ కనుక తరుణ్ చేయన్నాడు : సృజన్‌ యరబోలు

NTR: ఎన్‌టీఆర్ కు రక్ష‌ణ క‌ల్పించిన ఢిల్లీ హైకోర్టు

మీర్జాపురం రాణి-కృష్ణవేణి పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

నరేష్‌ అగస్త్య.. అసురగణ రుద్ర లో ఆర్యన్‌ రాజేష్‌ కీలక పాత్ర

Trivikram: వెంకటేష్ సినిమా శరవేగంగా షూటింగ్ - నారా రోహిత్ ఎంట్రీ ఇస్తున్నాడా?

తర్వాతి కథనం
Show comments