కంటిచూపును మెరుగుపరిచే చేపలతో పకోడీలు చేసేద్దామా?

ఒక పాన్‌ తీసుకుని కోడిగుడ్లను గిలకొట్టి అందులో ఉప్పు, కారం, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసి మరికాసేపు కలుపుకోవాలి. ఇందులోనే శుభ్రం చేసి వుంచిన చేప ముక్కల్ని కలు

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2017 (11:37 IST)
వారానికి రెండు సార్లు చేప‌ల‌ను తింటే దాంతో డ‌యాబెటిస్ దూరం అవుతుంది. ఇంకా గర్భంతో ఉన్న వాళ్లు చేపలు తింతే బాగా తెలివైన పిల్లలు పుడతారని, కంటిచూపును కూడా మెరుగుపరుచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాంటి చేపలతో కూర, ఫ్రైలు కాకుండా పకోడీలు ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
చేప ముక్కలు - రెండు కప్పులు
కోడిగుడ్లు -  మూడు
కార్న్‌ఫ్లోర్ - మూడు స్పూన్లు
కారం -  రెండు టీ స్పూన్లు
కొత్తిమీర - ఒక కట్ట
ఉప్పు, నూనె - తగినంత
నిమ్మరసం - 2 స్పూన్స్
 
తయారు చేసే విధానం :
ఒక పాన్‌ తీసుకుని కోడిగుడ్లను గిలకొట్టి అందులో ఉప్పు, కారం, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసి మరికాసేపు కలుపుకోవాలి. ఇందులోనే శుభ్రం చేసి వుంచిన చేప ముక్కల్ని కలుపుకోవాలి. చేప ముక్కలకు మసాలా బాగా అంటేలా చేసుకోవాలి. అర్థగంట పాటు ఈ మిశ్రమాన్ని పక్కనబెట్టేయాలి. ఆపై స్టౌ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడయ్యాక ఒక్కో ముక్కను కార్న్‌ఫ్లోర్ మిశ్రమంలో ముంచి దోరగా వేపుకోవాలి. ఈ వేయించిన చేప ముక్కల్ని గ్రీన్ చట్నీతో వేపుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నేను మహిళా జర్నలిస్టునే కదా, నన్నెందుకు వేధిస్తున్నారు: NTV జర్నలిస్ట్ దేవి (video)

అర్థరాత్రి వీధికుక్కల ఊళలు, కరుస్తున్నాయని 600 కుక్కల్ని చంపేసారు?!!

సంక్రాంతి కోడిపందెం.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న గుడివాడ వాసి

బ్యాకేజీ కంటెయిన్‌ను లాగేసుకున్న ఎయిరిండియా ఫ్లైట్ ఇంజిన్

స్వగ్రామంలో సంక్రాంతి సంబరాలు.. కుటుంబంతో పాల్గొన్న సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి... కొత్త సినిమా పోస్టర్లు రిలీజ్

జన నాయగన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు - హైకోర్టులోనే తేల్చుకోండి..

ఏనుగుల వేట ప్రేరణ తో కటాలన్ - ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌

ఆకాష్ - భైరవి అర్థ్యా జంటగా కొత్త మలుపు లుక్

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలయికలో చిత్రం

తర్వాతి కథనం
Show comments