Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహ వ్యాధిగ్రస్థులు అరటి ఆకులో ఉడికించిన చేప ముక్కల్ని తింటే?

మధుమేహం బారిన పడితే ఎన్నో ఆహార పదార్థాలను పక్కన బెట్టేయాల్సిందేనని చాలామంది అనుకుంటారు. కానీ సమతుల ఆహారం తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సమతుల ఆహారం తీసుకోవడంతో

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (14:59 IST)
మధుమేహం బారిన పడితే ఎన్నో ఆహార పదార్థాలను పక్కన బెట్టేయాల్సిందేనని చాలామంది అనుకుంటారు. కానీ సమతుల ఆహారం తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సమతుల ఆహారం తీసుకోవడంతో పాటు కొన్ని రకాల స్వీట్లను కూడా తీసుకోవచ్చు అంటున్నారు.. వైద్యులు.

మధుమేహ వ్యాధిగ్రస్థుల కోసం కొన్ని ప్రత్యేక నాన్ వెజ్ వంటకాలు, స్వీట్లు వున్నాయి. ఇంట్లోనే తయారు చేసే స్వీట్లను మధుమేహులకు ఇవ్వొచ్చు. అలాంటి వాటిలో ఒకటే ఫ్రూట్ హల్వా. అలాగే సీఫుడ్స్‌ను డయాబెటిస్ పేషెంట్లు తీసుకోవచ్చు.  
 
చేపలు, రొయ్యలు వంటి సీ పుడ్స్‌ను మధుమేహ వ్యాధిగ్రస్థులు తీసుకోవచ్చు. చిన్నపాటి చేపల కూరలను తీసుకోవచ్చు. చేపల్లో ఒమేగా త్రీ పుష్కలంగా వుంటుంది. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. అయితే చేపలను ఇంకా సీఫుడ్స్‌ను నూనెలో వేయించకుండా గ్రేవీల్లో ఉడికించి తీసుకోవడం మంచిది. తద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. 
 
మధుమేహ వ్యాధిగ్రస్థులు నూనె లేని చేపల వంటకాలను తీసుకోవచ్చు. అలాంటి వాటిలో ఒకటే ఈ చేపల వంటకం.. దీన్ని ట్రై చేసి చూడండి.. 
 
కావలసిన పదార్థాలు:
మీకు నచ్చిన చేప ముక్కలు - పావు కేజీ
కొత్తిమీర పేస్ట్ - పావు కప్పు 
పుదీనా పేస్ట్ - పావు కప్పు 
వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు 
అల్లం పేస్ట్ - రెండు స్పూన్లు 
ఉప్పు- తగినంత 
పచ్చిమిర్చి పేస్ట్ - ఒక స్పూన్ 
నిమ్మరసం - ఒక టేబుల్ స్పూన్ 
అరటి ఆకు - ఒకటి 
 
తయారీ విధానం : 
చేపలను మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకుని కట్ చేసిన చేప ముక్కలకు పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్టులను, ఉప్పు, నిమ్మరసం పట్టించి అరటి ఆకులో పేర్చాలి. తర్వాత ఆకులో వుంచిన చేప ముక్కలను అదే అరటి ఆకుతోనే చుట్టి ఇడ్లీ కుక్కర్లో ఉడికించాలి. ఇలా మసాలా దట్టించి.. ఇడ్లీ కుక్కర్లో వుంచిన చేపముక్కలు 20 నిమిషాలు బాగా ఉడికాక.. అరటి ఆకులోని చేప ముక్కలను వేడి వేడిగా కొత్తిమీర తరుగుతో గార్నిష్‌తో సర్వ్ చేయాలి. 
 
ఇలా మధుమేహ వ్యాధిగ్రస్థులు చేపలను ఉడికించి తీసుకోవడం ద్వారా వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయి. ఇలా తీసుకుంటే మధుమేహం నియంత్రణలో వుంటుంది. గుండె పనితీరు మెరుగవుతుంది. ఒబిసిటీ దూరమవుతుంది. కంటికి మేలు చేకూరుతుంది. అరటి ఆకులో వుంచి చేప ముక్కలను ఉడికించి తీసుకోవడం ద్వారా వాటిలో చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది. పోషకాలు తరగవు. రుచి కూడా అదిరిపోతుంది. 
 
ఇక మధుమేహ వ్యాధిగ్రస్థులకు తాజా పండ్లతో హల్వా ఎలా చేయాలో చూద్దాం..  
కావలసిన పదార్థాలు 
బొప్పాయి- ఒక కప్పు 
ఆపిల్ - ఒక కప్పు 
ఆరెంజ్- ఒక కప్పు 
ఉప్పు - చిటికెడు 
షుగర్ ఫ్రీ స్వీట్నర్స్ - 50 గ్రాములు 
జీడిపప్పు- పావు కప్పు 
బాదం పలుకులు - పావు కప్పు 
ఏలకులపొడి- పావు టీ స్పూన్ 
నూనె - తగినంత 
 
తయారీ విధానం :
గింజలు, తొక్కలు తీసేసిన ఆపిల్, ఆరెంజ్, బొప్పాయి పండ్ల ముక్కలను మిక్సీలో కాసింత నీరు చేర్చుకుని రుబ్బుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఓ పాత్రలోకి తీసుకోవాలి. ఆపై స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక రుబ్బుకున్న పండ్ల మిశ్రమాన్ని అందులో వేసి.. ఓ స్పూన్ నెయ్యి వేసి.. కృత్రిమ పంచదారను చేర్చి కలుపుతూ వుండాలి. హల్వాలా తయారయ్యేంతవరకు వుంచి.. నేతిలో వేపుకున్న జీడిపప్పు, బాదం పలుకులను, ఏలకుల పొడి చేర్చాలి. అంతే తాజా పండ్లతో మధుమేహ వ్యాధిగ్రస్థులకు హల్వా రెడీ అయినట్లే. ఈ హల్వాను ఒక రోజు మాత్రం వాడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments