Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమపిండితో ఎగ్ స్టఫ్డ్ పరోటా ఎలా చేయాలో చూద్దాం..

ముందుగా ఓ గిన్నెలో ఉడికించిన కోడిగుడ్లను సన్నగా తురుముకోవాలి. అందులో మిరియాలపొడి, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి కలపాలి. మరో పాత్రలో గోధుమపిండి, ఉప్పు, టేబుల్‌స్పూను నెయ్యి, తగినన్ని నీళ్లు పోసి కలిపి స

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (13:13 IST)
గోధుమలు, కోడిగుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చు. రోజూ అల్పాహారంగా కోడిగుడ్డును తీసుకోవడంతో పాటు.. గోధుమ రొట్టెలను మితంగా తీసుకోవడం ద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. ఈ రెండింటి కాంబోలో వీట్ ఎగ్ స్టఫ్డ్ పరోటా ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
ఉడికించిన కోడిగుడ్లు : ఆరు,
గోధుమపిండి: పావుకిలో,
మిరియాలపొడి: టీస్పూను, 
కొత్తిమీర తురుము: అరకప్పు
నూనె లేదా నెయ్యి: వేయించడానికి సరిపడా
ఉప్పు : తగినంత 
 
తయారీ విధానం : 
ముందుగా ఓ గిన్నెలో ఉడికించిన కోడిగుడ్లను సన్నగా తురుముకోవాలి. అందులో మిరియాలపొడి, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి కలపాలి. మరో పాత్రలో గోధుమపిండి, ఉప్పు, టేబుల్‌స్పూను నెయ్యి, తగినన్ని నీళ్లు పోసి కలిపి సుమారు పావుగంటసేపు నాననివ్వాలి. ఇప్పుడు పిండి ముద్దను చపాతీల్లా వత్తుకోవాలి. తరవాత అందులో గుడ్డుమిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేసి మళ్లీ చపాతీలా వత్తి పెనంమీద నెయ్యి లేదా వెన్న వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి. అంతే వీట్ ఎగ్ స్టఫ్డ్ పరోటా రెడీ అయినట్లే. ఈ ఎగ్ పరోటాలను గ్రీన్ చట్నీ లేదా చికెన్ కుర్మాతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. 

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments