చపాతీల్లోకి యమ్మీగా వుండే ఎగ్ కర్రీ ఎలా చేయాలి?

పాన్‌లో నూనె వేడెక్కిన తర్వాత.. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం పేస్టు, వెల్లుల్లి వేసి రెండు నుంచి మూడు నిమిషాల వరకు దోరగా వేయించాలి. పెరుగు, ఫ్రెష్ క్రీమ్ బాగా కలపాలి. తర్వాత కస్తూరీ మేథీ, గరం మసాలా,

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2017 (11:22 IST)
చపాతీల్లో దాల్ సైడిష్‌గా సర్వ్ చేసి విసిగిపోయారా? అయితే ఆ వెరైటీ కర్రీ ట్రై చేయండి. సాధారణంగా గోధుమలతో తయారయ్యే చపాతీల్లో ఫైబర్ పుష్కలంగా వుంటుంది. అలాగే కోడిగుడ్లలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలెన్నో వున్నాయి. అలాంటి కోడిగుడ్లతో వెరైటీ కర్రీ ట్రై చేద్దాం.. ఎలా చేయాలంటే...?
 
కావలసిన పదార్థాలు: 
ఉడికించిన కోడిగుడ్లు - పది 
వెల్లుల్లి, అల్లం పేస్టు - రెండు స్పూన్లు 
ఉల్లి తురుము - ఒక కప్పు 
పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూన్లు 
ఫ్రెష్ క్రీమ్ - ఒక టేబుల్ స్పూన్ 
పెరుగు - రెండు టీ స్పూన్లు, 
చాట్ మసాలా- ఒక టేబుల్ స్పూన్ 
కొత్తిమీర తరుగు- ఒక కట్ట
ఉప్పు, నూనె- తగినంత
 
కావలసిన పదార్థాలు:
పాన్‌లో నూనె వేడెక్కిన తర్వాత.. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం పేస్టు, వెల్లుల్లి వేసి రెండు నుంచి మూడు నిమిషాల వరకు దోరగా వేయించాలి. పెరుగు, ఫ్రెష్ క్రీమ్ బాగా కలపాలి. తర్వాత కస్తూరీ మేథీ, గరం మసాలా, మిర్చిపొడి, ఉప్పు వేసి కలపాలి. ఒక కప్పు నీళ్లు పోసి కాసేపు ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత ఉడికిన కోడిగుడ్లకు చిన్న చిన్న గాట్లు పెట్టి... వేయాలి. ఐదు నిమిషాల తర్వాత స్టవ్ మీద నుంచి గ్రేవీని దించేయాలి. ఈ కర్రీపై కొత్తిమీర కురుమును చల్లి.. చపాతీల్లోకి  వడ్డిస్తే యమ్మీగా వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

తర్వాతి కథనం
Show comments