Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల కోసం పసందైన స్నాక్స్ "రాగి బూస్టీ టేస్టీ"

Webdunia
కావలసిన పదార్థాలు :
మైదాపిండి.. అర కేజీ
డాల్డా.. పావు కేజీ
పంచదార.. పావు కేజీ
బూస్టు.. 50 గ్రా.
చిక్కటిపాలు.. ఒకటిన్నర కప్పు
యాలకులపొడి.. ఒక టీ.
ఉప్పు.. పావు టీ.
అమ్మోనియం బై కార్బొనేట్.. అర టీ.
సోడా బైకార్బ్.. అర టీ.

తయారీ విధానం :
డాల్డా, పంచదారపొడి, బూస్టు కలిపి క్రీములా చేయాలి. వీటికి మైదా, పాలు, యాలకులపొడి, అమ్మోనియం బైకార్బొనేట్‌, సోడా బైకార్బ్‌, ఉప్పు చేర్చి ముద్దలా కలిపి కాసేపు గాలి చొరబడకుండా మూతపెట్టి ఉంచాలి. ఈ పిండిని చపాతీలా అరంగుళం మందంగా చేసి పలుచటి స్టీలు చాకుతోగానీ, నలుచదరంగా ఉండే ఏదైనా చిన్న గిన్నెతో గానీ ముక్కలుగా కోసి నెయ్యి రాసిన ప్లాస్టిక్‌ ట్రేలో ఉంచి మైక్రోవేవ్ ఓవెన్‌లో 15 నిమిషాలపాటు 275 డిగ్రీల ఫారన్‌ హీట్‌ వద్ద బేక్‌ చేయాలి.

ఒవెన్‌ లేకపోతే కుక్కర్‌లో గానీ, మూత ఉన్న మందపాటి పాత్రలోగానీ ఇసుకపోసి పొయ్యిమీద పెట్టి పదినిమిషాలు ఉంచాలి. కుక్కర్‌లో పెట్టినప్పుడు గ్యాస్‌కెట్‌ తీసేయాలి. ఇసుక వేడెక్కాక బిస్కెట్స్‌ ప్లేటు పెట్టాలి. ప్లేటు మందంగా, లోతుగా ఉండాలి. పది నిమిషాల తరువాత తీసి చూస్తే బూస్టీ టేస్టీ బిస్కెట్స్‌ రెడీ.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments