Webdunia - Bharat's app for daily news and videos

Install App

జుట్టు పొడిబారకుండా ఉండాలంటే.. ఇలా చేయాలి..?

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (11:01 IST)
చలికాలంలో చర్మం రక్షణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో.. అదే విధంగా కేశ రక్షణ అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే.. ఈ కాలంలో అనారోగ్య సమస్యల కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. దాంతో పాటు పొడిబారుతుంటుంది. అందుకు రకరకాల షాంపూలు, నూనెను వాడుతుంటారు. వీటిని వాడడం వలన ఎలాంటి ఫలితాలు ఉండవని చెప్తున్నారు. కాబట్టి ఇంట్లో సహజసిద్ధమైన పదార్థాలతో కేశ రక్షణ ఎలా చేయాలో చూద్దాం...
 
చాలామంది తలస్నానం చేసిన తరువాత కేశాలను వివిధ రకాలుగా కొప్పు వేస్తుంటారు. ఇలా చేసినప్పుడు జుట్టు బిగుతుగా ఉంటుంది.  దాంతో జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటుంది. జుట్టు చిట్లే అవకాశాలున్నాయి. కనుక కొప్పుకు బదులుగా జడ వేసుకుంటే మంచిది. అంతేకాకుండా తలనొప్పి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక కొప్పులను వేయడం మానేయండి.
 
ఈ చలికాలంలో రోజూ తలస్నానం చేయడం వలన వెంట్రుకలకు పోషణనిచ్చే సహజ నూనెలు తొలగిపోయి జుట్టు బలహీనంగా, జీవం కోల్పోయినట్టుగా కనిపిస్తుంది. కనుక వారంలో రెండుసార్లు జుట్టును శుభ్రం చేయడం మంచిది. షాంపూతో తలస్నానం చేసిన తరువాత జుట్టుకు కండిషినింగ్ తప్పనిసరిగా చేయాలి. కండిషినింగ్ చేస్తే వెంట్రుకలు అంతగా పొడిబారవు. 
 
వారంలో ఓసారి గోరువెచ్చటి కొబ్బరి నూనెతో లేదా బాదం నూనెతో తలకు మర్దన చేసుకోవాలి. దీంతో తల భాగంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టుకు కావలసిన పోషకాలు కూడా అందుతాయి. దాంతో జుట్టు పొడిబారడం తగ్గి చుండ్రు సమస్య పోతుంది. తడి జుట్టును ట్రిమ్ చేస్తే జుట్టు దృఢత్వాన్ని కోల్పోతుంది. అందువలన ట్రిమ్మింగ్ చేయకండి..  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments