Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏలూరులో తనైరా తొలి ప్రదర్శన: ఫెస్టివ్‌‌వేర్‌ చీరలు, లెహంగాల విక్రయాల నిర్వహణ

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (17:06 IST)
ఏలూరు: టైటాన్‌కు చెందిన అతి పిన్నవయసు కలిగిన బ్రాండ్‌, తనైరా 09 ఫిబ్రవరి- 11 ఫిబ్రవరి 2021వ తేదీ(మంగళవారం నుంచి గురువారం వరకూ) మూడు రోజుల పాటు ప్రత్యేకంగా ఎంపిక చేసిన చీరలు మరియు లెహంగాలతో ఓ ప్రదర్శన మరియు అమ్మకంను తనిష్క్‌ ఏలూరు, ఆర్‌ఆర్‌ పేట మెయిన్‌ రోడ్‌, రెవిన్యూ వార్డ్‌, ఏలూరు, ఆంధ్రప్రదేశ్‌- 534002 వద్ద చేయనుంది. 
 
ఈ ప్రదర్శనకు విచ్చేసిన సందర్శకులు తనైరా యొక్క ప్రత్యేకమైన కలెక్షన్‌ను వీక్షించవచ్చు. వీటిలో చందేరీ, మహేశ్వరి, బెంగాల్‌, భగల్‌పూర్‌, కాంజీవరం, దక్షిణ మరియు భారతదేశంలోని పలు ప్రాంతాలలో చేతితో రూపొందించిన 1500కు పైగా  చీరలు మరియు లెహంగాల కలెక్షన్‌ను వీక్షించవచ్చు. ఎంపిక చేసిన ఉత్పత్తులపై 30% వరకూ రాయితీని సైతం ఈ బ్రాండ్‌ అందిస్తుంది.
 
ఏలూరు ప్రదర్శన గురించి శ్రీమతి రాజేశ్వరి శ్రీనివాసన్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, తనైరా మాట్లాడుతూ, ‘‘పురాతన వారసత్వం, సంస్కృతి, టెక్స్‌టైల్స్‌ యొక్క అపూర్వమైన సంగమం, చారిత్రాత్మాక నగరం ఏలూరు. టస్సర్‌, బెనారసీ మొదలు చందేరీ మరియు మహేశ్వరితో పాటుగా మా ప్రత్యేకమైన బ్రైడల్‌ డిజైన్స్‌తో కూడిన నూతన శ్రేణిని ఈ ఎగ్జిబిషన్‌తో తీసుకురావడం పట్ల సంతోషంగా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా పలు  ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన ఈ కలెక్షన్‌తో పాటుగా మా అంతర్గత డిజైన్లకు వివేకవంతులైన ఇక్కడి మహిళల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తుందనే విశ్వాసంతో ఉన్నాం’’ అని అన్నారు.
 
ఏలూరులో విస్తృతశ్రేణి కలెక్షన్స్‌ను తనైరా ప్రదర్శిస్తుంది. వీటిలో తనైరా యొక్క నూతన జోడింపులో ముగ్గురు దేవతలు- దుర్గ, లక్ష్మి, సరస్వతి యొక్క సాంస్కృతిక, డిజైన్‌ అంశాల స్ఫూర్తితో ప్రత్యేకమైన చీరల కలెక్షన్‌ ‘తస్వి’ సైతం ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్‌లో లినెన్‌ యొక్క విలాసవంతమైన కలెక్షన్‌ ‘ఫ్లోరెల్లీ’ సైతం ప్రదర్శిస్తారు. అలాగే పేస్టల్‌ టోన్స్‌ డ్రీమీ సిల్‌హ్యుటీలతో సిల్క్‌ శారీలు సైతం ప్రదర్శిస్తారు.
 
ఈ ఎగ్జిబిషన్‌లో బ్రైడల్‌ మరియు వెడ్డింగ్‌ కలెక్షన్స్‌ను బనారస్‌, కాంచిపురం నుంచి అతి సున్నితమైన సిల్క్స్‌తో తీర్చిదిద్దినవి కూడా ప్రదర్శిస్తారు. వీటితో పాటుగా తనైరా యొక్క రెడీ టు వేర్‌ శ్రేణి; లినెన్స్‌, టస్సర్స్‌ మరియు సాఫ్ట్‌ సిల్క్‌ ఇకత్స్‌తో తయారుచేసిన ఆకర్షణీయమైన కుర్తా సెట్స్‌- ఐరా, డ్రెస్‌ మెటీరియల్స్‌, రెడీ టు వేర్‌ బ్లౌజ్‌లు, మాస్క్‌లు, స్టోల్స్‌ మరియు దుపట్టలను సైతం ప్రదర్శిస్తారు.
 
ఆరంభమైన నాటి నుంచి తనైరా విజయవంతంగా దేశవ్యాప్తంగా 14 స్టోర్లను ప్రారంభించింది. బెంగళూరులో ఇందిరా నగర్‌, జయనగర్‌, కమర్షియల్‌ స్ట్రీట్‌, ఒరియన్‌ మాల్‌ మరియు ఫోనిక్స్‌ మార్కెట్‌ సిటీ మాల్‌లలో నిర్వహిస్తుంది. ఢిల్లీలో ఈ బ్రాండ్‌ మూడు స్టోర్లను సౌత్‌ ఎక్స్‌, యాంబియన్స్‌ మాల్‌, వసంత్‌ కుంజ్‌ మరియు ద్వారక; హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఒక స్టోర్‌, పూనెలో ఔంధ్‌ వద్ద మరోటి నిర్వహిస్తుంది. ఈ బ్రాండ్‌ మూడు స్టోర్లను ముంబైలోని ఘట్కోపర్‌, ఇనార్బిట్‌ మాల్‌ వాషి మరియు ఇటీవలనే బాంద్రాలో టర్నర్‌ రోడ్‌ వద్ద నిర్వహిస్తుంది. ఈ బ్రాండ్‌ మెరుగైన షాపింగ్‌ అనుభవాలను అందించడంతో పాటుగా పూర్తి స్ధాయిలోని స్టైల్‌ స్టూడియోను నిర్వహిస్తుంది. దీనిలో రెడీ టు వేర్‌ బ్లౌజులు, కస్టమైజేషన్‌ మరియు టైలరింగ్‌ సేవలు వంటివి మీ షాపింగ్‌ను పరిపూర్ణం చేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాలుడిని ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి.. అక్కడే హత్య.. వాడు మనిషేనా?

తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదు.. బాలికను కిడ్నాప్ చేశారు.. కానీ 2 గంటల్లోనే?

ప్రియుడితో ఏకాంతంగా లేడీ పోలీస్, భర్త వచ్చేసరికి మంచం కింద దాచేసింది

అమెరికా అదనపు సుంకాలు.. భారత్‌కు రిలీఫ్.. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే?

Atal Bihari Vajpayee: అటల్ బిహారీ వాజ్‌పేయి ఏడవ వర్ధంతి..ప్రముఖుల నివాళి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

మహావతార్ నరసింహ: పురాణాలకు దగ్గరగా వుంది.. మహావతార్ నరసింహ అవతారాన్ని చూసినట్లుంది (video)

సారధి స్టూడియోలో భీమవరం టాకీస్ 15 చిత్రాలు ప్రారంభం

ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు కథ ఏం చెప్పబోతోంది తెలుసా !

తర్వాతి కథనం
Show comments