అతివల మనసు దోచే అందమైన వస్త్రాలను అతి తక్కువ ధరలకు అందించే 'కైరా' షోరూమ్(బై మహారాజా డిజైన్స్)వస్త్ర ప్రియుల ముందుకొచ్చింది. నేటితరం వారు మెచ్చే అత్యద్భుతమైన డిజైన్లతో కూడిన 'కైరా' 10వ షోరూమ్‌ను కొండపూర్‌లో గురువారం 'కిరాక్' సినిమా కథానాయిక చాందిని ప్రారంభించారు.
అనంతరం చాందిని మాట్లాడుతూ... ఫ్యాషన్‌గా తయారవ్వడమంటే నాకు చాలా ఇష్టం. నేటితరం అమ్మాయిలు మెచ్చే అన్ని రకాల డిజైన్స్‌లో డ్రెస్లిక్కడ ఉన్నాయి. కైరాలో ఉన్న కలెక్షన్స్ అన్ని నన్ను ఆకట్టుకున్నాయి. షూటింగ్ లేని సమయంలో ఫ్యాషన్‌తో పాటు బాడీ ఫిట్నెస్ మీద దృష్టిపెడతాను అని తెలిపారు.
హిట్ టాక్ పిక్చర్స్ పతాకంపై డి.గోపికృష్ణ-గంగపట్నం శ్రీధర్ నిర్మాతలుగా హారిక్ దేవభక్తుని దర్శకత్వంలో తెరకెక్కిన 'కిరాక్' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకిరానుంది. ఇందులో చక్కని క్యారెక్టర్ చేశాను. అలాగే మరో రెండు సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నాను. కథానాయికగా తెలుగులో నాకు చాలా కంఫర్ట్‌గా ఉంది. మంచి అవకాశాలొస్తున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు చాందిని.
కన్న కూతురు తప్పిపోతే తల్లిపడే ఆవేదన, పవన్ కళ్యాణ్ ఫ్యాన్...మహేష్ బాబు ఫ్యాన్ అయిన అమ్మాయిని ప్రేమలో పడేయడానికి చేసే ఆలోచన, 15 ఏళ్ళ క్రితం తప్పిపోయిన పాప ఎవరు అని హీరో చేసే ప్రయత్నం. ఈ మూడింటి కలయికే కిరాక్ చిత్రం. చక్కని రొమాంటిక్ థ్రిల్లర్ ఇది. సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తాం.
అలాగే ప్రమోషన్లో భాగంగా 'కిరాక్ పంచ్ కొట్టు... పోరిని పట్టు' అనే ఓ కాన్సెప్ట్‌ని త్వరలో లాంచ్ చేయబోతున్నాం. ఎవరైనాగానీ తమకి ఇష్టమైన వాళ్ళ గురంచి ఓ పంచ్ డైలాగ్ రాసి, లేదా రికార్డ్ చేసి కిరాక్ ఫేస్బుక్ ఫేజ్‌లో పోస్ట్ చేస్తే... మాకు నచ్చిన డైలాగ్‌ని సెలెక్ట్ చేసి వారికి బహుమతులు అందచేస్తాం అని తెలిపారు.
సినిమా బాగా వచ్చింది. పాటలకు మంచి స్పందన వస్తోంది. త్వరలో సినిమాను విడుదల చేస్తాం. కైరాతో కిరాక్ టీమ్ అసోసియేట్ కావడం ఆనందంగా ఉందని నిర్మాతలు డి.గోపికృష్ణ-గంగపట్నం శ్రీధర్ తెలిపారు.
కైరా షోరూమ్ అధినేత కాశ్మీర - దినేష్ మంగ్లాని మాట్లాడుతూ... కైరా 10వ బ్రాంచ్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. కస్టమర్ల ఆదరణతో ముందుకు సాగుతున్నాం. సౌత్ మొత్తం 'కైరా'ని డెవలప్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.