Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోపాల్‌పై పట్టువీడని అద్వానీ.. బుజ్జగిస్తున్న బీజేపీ

Webdunia
గురువారం, 20 మార్చి 2014 (11:54 IST)
File
FILE
బీజేపీ అగ్రనేత ఎల్కే.అద్వానీకి భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిటీ ఝులక్ ఇవ్వడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆయనను బుజ్జగించేందుకు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో పాటు.. సుష్మా స్వరాజ్‌లు గురువారం అద్వానీ నివాసానికి చేరుకుని చర్చలు జరిపారు.

గుజరాత్ ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో ఉన్న విభేదాల కారణంగా ఐదుసార్లు పోటీ చేసిన గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానానికి బదులుగా ఈసారి మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి బరిలో దిగాలనుకున్న ఆయన ఆశలపై పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నీళ్లుచల్లింది.

పార్టీలోని సీనియర్లకు కోరుకున్న చోట సీట్లు కేటాయిస్తున్న తరహాలో తనకు కూడా భోపాల్ సిటీ స్థానాన్ని కేటాయించాలన్న ఆయన డిమాండ్‌ను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. మోడీ కోసం భోపాల్ స్థానాన్ని వదులుకునేందుకు సిద్ధమని పార్టీ సిట్టింగ్ ఎంపీ, సీనియర్ నేత కైలాశ్ జోషీ ప్రకటించినా బీజేపీ అధిష్టానం మాత్రం అద్వానీకి ఆ సీటును కేటాయించేందుకు ససేమిరా అంటోంది. అద్వానీ ఈసారి కూడా గాంధీనగర్ స్థానం నుంచే తిరిగి పోటీ చేయాలని కోరింది. దీనికి ఆయన ససేమిరా అంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha : త్రిష సంచలనం నిర్ణయం.. సినిమాలను పక్కనబెట్టి విజయ్‌తో పొలిటికల్ జర్నీ?

టికెట్ రేట్లు పెంచడంకంటే కంటెంట్ చిత్రాలు తీయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

సంబరాల ఏటిగట్టు సెట్ లో సాయిదుర్గ తేజ్ ఫ్యాన్స్ కు ఏంచెప్పారో తెలుసా

శివరాత్రికి ప్రజ్వల్ దేవరాజ్ రాక్షస సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

Show comments