Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ మేనిఫెస్టో : శ్రీరామనవమి రోజున రాముడికి కానుక!

Webdunia
సోమవారం, 7 ఏప్రియల్ 2014 (12:14 IST)
File
FILE
శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమికి భారతీయ జనతా పార్టీ సోమవారం విడుదల చేసిన మేనిఫెస్టోలో చిరుకానుకను ప్రకటించింది. రాజ్యాంగానికి లోబడి రామాలయ నిర్మాణాన్ని చేపడుతామని మేనిఫెస్టోలో పేర్కొంది.

అలాగే మైనారిటీల అభ్యున్నతికి తమ పార్టీ కృషి చేస్తుందని పేర్కొంది. దేశంలోని ఇతర వర్గాలతో పాటు.. ముస్లింలకు సమాన అవకాశాలు కల్పిస్తామని తెలిపింది. 52 పేజీలున్న మేనిఫెస్టోని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీలు సోమవారం సంయుక్తంగా విడుదల చేశారు.

దేశ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా బీజేపీ మేనిఫెస్టో ఉందని చెప్పారు. బీజేపీ మేనిఫెస్టో తయారీ కోసం మురళీ మనోహర్ జోషీ ఆధ్వర్యంలోని 17 మంది సభ్యులతో కూడిన కమిటీ పనిచేసింది. ఉపాధి కల్పనకు పెద్దపీట వేసింది. పోలీసుల, న్యాయ పరిపాలన విభాగాల్లో సంస్కరణలు చేపట్టనుంది. మహిళల భద్రతకు ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పాటు చేయనుంది.

అందరికీ ఆహార భద్రతే లక్ష్యంగా పని చేయనుంది. విదేశాల్లో నల్లధనం వెలికితీతకు ప్రత్యేక విభాగం, బ్రాండ్ ఇండియా రూపకల్పన, ప్రతి ఒక్కరికీ సాగు - తాగు నీరు తదితర అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

Show comments