Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్ సింగ్ ఆస్తి రూ.100 కోట్లు : ఫతేపూర్ సిక్రీ నుంచి పోటీ

Webdunia
శుక్రవారం, 11 ఏప్రియల్ 2014 (16:46 IST)
File
FILE
సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృత నేత, రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ అధినేత అమర్ సింగ్ ఆస్తి అక్షరాలా వంద కోట్ల రూపాయలు. ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ఫతేపూర్ సిక్రీ స్థానం బరిలోకి దిగుతున్న విషయం తెల్సిందే.

ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తనకు, తన భార్యకు కలిపి వంద కోట్ల ఆస్తి ఉందని ప్రకటించారు. బ్యాంకు డిపాజిట్లు, షేర్లలో పెట్టుబడి, మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలు కలిపి రూ.41.34 కోట్ల చరాస్తులు ఉన్నాయని ఆయన తెలిపారు.

ఓ భాగస్వామ్య సంస్థలో రూ.12.23 కోట్ల పెట్టుబడి, లెక్సస్; మారుతి స్విఫ్ట్ కార్లు, రూ.8.68 లక్షల విలువైన బంగారం, 28 కిలోల వెండి పాత్రలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇంకా ఫర్నీచర్, వాచీలు, పెయింటింగులు.. వీటన్నింటి విలువ మరో రూ.64.40 లక్షలు ఉంటాయని తెలిపారు.

ఆయన భార్యకు రూ.21.95 కోట్ల చరాస్తులున్నాయి. తనకు చేతిలో రూ.పది లక్షల నగదు, తన భార్యకు రూ.ఐదు లక్షల నగదు ఉన్నట్లు అమర్ సింగ్ తెలిపారు. అలాగే, నోయిడా, లక్నో, బెంగళూరు ప్రాంతాల్లో ఇళ్లు, భూములు ఉన్నట్టు పేర్కొన్నారు.

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments