Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్వానీకి పూర్తి స్వేచ్ఛ ఉంది : వెంకయ్య నాయడు

Webdunia
ఆదివారం, 23 మార్చి 2014 (17:24 IST)
File
FILE
లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలన్న అంశంపై తమ పార్టీ అగ్రనేత ఎల్కే. అద్వానీకి పూర్తి స్వేచ్ఛ ఉందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. అద్వానీ కోరుకున్న లోక్‌సభ టిక్కెట్‌ను కేటాయించే అంశంపై చిన్నపాటి వివాదం చెలరేగిన విషయం తెల్సిందే. అంతేకాకుండా, ప్రస్తుత నాయకత్వం బీజేపీ సీనియర్ నేతలను పక్కన పెడుతున్నారంటూ విమర్శలు వచ్చాయి.


వీటిపై వెంకయ్య నాయుడు స్పందిస్తూ.. తాము సీనియర్ నాయకులను పక్కనబెట్టే ప్రశ్నేలేదన్నారు. పార్టీలో విభేదాలు లేవని, ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై సీనియర్ నేత అద్వానీకి చాయిస్ ఇచ్చామని, ఆయన గుజరాత్‌లోని గాంధీనగర్ ఎంచుకున్నారని తెలిపారు.

ఇక టికెట్ దక్కని కారణంగానే జశ్వంత్ సింగ్ ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతున్నారని పేర్కొన్నారు. పార్టీ ఆయనను ఎల్లప్పుడూ గౌరవించిందని, రాజ్యసభకు పంపిందని వెంకయ్య గుర్తు చేశారు. పార్టీ ఆయనను ఆర్థిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా నియమించిందని చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!

జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!

Trisha : త్రిష సంచలనం నిర్ణయం.. సినిమాలను పక్కనబెట్టి విజయ్‌తో పొలిటికల్ జర్నీ?

టికెట్ రేట్లు పెంచడంకంటే కంటెంట్ చిత్రాలు తీయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

Show comments