Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీజీ... మీ హామీలన్నీ జర తీరుతాయా...

Webdunia
శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (22:28 IST)
FILE
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఇదివరకు ఒకసారి దేశంలోని సమస్యలన్నిటికీ రాత్రికి రాత్రే మాయం చేసేందుకు తనవద్ద మంత్రం దండం ఏమీ లేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ప్రధానమంత్రి పీఠం కోసం కమిట్ అయిన నేపథ్యంలో దేశంలోని సమస్యలన్నీ చిటెకలో పరిష్కరిస్తానని హామీలు గుప్పిస్తున్నారు. తెలంగాణలోని వరంగల్, హైదరాబాదులో జరిగిన సభల్లో రాహుల్ గాంధీ చాలా హామీలు గుప్పించారు. కోట్లకొద్దీ హామీల వరద పారించేశారు.

తను తెలంగాణకు తొలి మహిళా ముఖ్యమంత్రిని చూడాలనుకుంటున్నాననీ, వరంగల్లులో కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులు తీసుకురావాలనుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు తాము తెలంగాణను 29వ రాష్ట్రంగా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ప్రకటించామనీ, తెలంగాణ రాష్ట్రం జూన్ 2న ఏర్పాటవుతుందని ప్రకటించారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కలను సాకారం చేశామనీ, తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా మహిళను చూడాలనుకుంటున్నట్లు ప్రకటించారు.

కాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు అటు తెరాసను ఇటు తెదేపాను ఒకేసారి తన ప్రకటనతో కొట్టేశారు. బీసీ ముఖ్యమంత్రి అంటూ బాబు ముందుకు వెళుతుంటే, కేసీఆర్ ఏమాటా చెప్పకుండా తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నట్లు పోతుంటే వారికి బ్రేకులు వేస్తూ తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి ఆకాంక్ష అంటూ తెరపైకి కొత్త చర్చను తెచ్చారు రాహుల్.

ఇపుడు ఆ తొలి మహిళా ముఖ్యమంత్రి రేసు గురించి తెలంగాణలో అప్పుడే చర్చలు జరిగిపోతున్నాయి. సీనియర్ నాయకురాలు, మాజీమంత్రి గీతారెడ్డి రేసులో ముందు వరుసలో ఉన్నారని కొందరంటుంటే, అలాక్కాదు సినీనటి జయసుధకు దక్కే ఛాన్స్ ఉందని మరికొందరు అంటున్నారు.

వీరిద్దరూ కాదు.. గద్వేల్ నాయకురాలు డి.కె అరుణకు ఛాన్స్ పుష్కలంగా ఉందని మరికొందరు అంటున్నారు. మొత్తమ్మీద జానారెడ్డి, దామోదర రాజనరసింహ, పొన్నాల వగైరా వగైరా నాయకులకు ఇక సీఎం పీఠం అందని ద్రాక్షేనన్నమాట. 'యువరాజు' ఎంతమాట చెప్పి వెళ్లిండు...?
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)

Pushpa-2: పుష్ప2 కలెక్షన్లు కుమ్మేసింది.. 20వ రోజు రూ.14.25 కోట్లు వసూలు

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

Show comments