Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేడిన్ తెలంగాణ వాచ్ కావాలి... టి.కి మహిళ సీఎం... రాహుల్ గాంధీ

Webdunia
శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (19:55 IST)
FILE
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వరంగల్ జిల్లా మడికొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావుపై ధ్వజమెత్తారు. తాము తెలంగాణను 29వ రాష్ట్రంగా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ప్రకటించామనీ, తెలంగాణ రాష్ట్రం జూన్ 2న ఏర్పాటవుతుందని ప్రకటించారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కలను సాకారం చేశామనీ, తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా మహిళను చూడాలనుకుంటున్నట్లు ప్రకటించారు.

కాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు అటు తెరాసను ఇటు తెదేపాను ఒకేసారి తన ప్రకటనతో కొట్టేశారు. బీసీ ముఖ్యమంత్రి అంటూ బాబు ముందుకు వెళుతుంటే, కేసీఆర్ ఏమాటా చెప్పకుండా తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నట్లు పోతుంటే వారికి బ్రేకులు వేస్తూ తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి ఆకాంక్ష అంటూ తెరపైకి కొత్త చర్చను తెచ్చారు రాహుల్.

ఇపుడు ఆ తొలి మహిళా ముఖ్యమంత్రి రేసు గురించి తెలంగాణలో అప్పుడే చర్చలు జరిగిపోతున్నాయి. సీనియర్ నాయకురాలు, మాజీమంత్రి గీతారెడ్డి రేసులో ముందు వరుసలో ఉన్నారని కొందరంటుంటే, అలాక్కాదు సినీనటి జయసుధకు దక్కే ఛాన్స్ ఉందని మరికొందరు అంటున్నారు.

వీరిద్దరూ కాదు.. గద్వేల్ నాయకురాలు డి.కె అరుణకు ఛాన్స్ పుష్కలంగా ఉందని మరికొందరు అంటున్నారు. మొత్తమ్మీద జానారెడ్డి, దామోదర రాజనరసింహ, పొన్నాల వగైరా వగైరా నాయకులకు ఇక సీఎం పీఠం అందని ద్రాక్షేనన్నమాట. 'యువరాజు' ఎంతమాట చెప్పి వెళ్లిండు...?
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

Show comments