తెలంగాణ రాష్ట్ర సమితి మేనిఫెస్టోను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కెసిఆర్ విడుదల చేయనున్నారు. తెలంగాణ భవన్ లో తెరాస పార్టీ అధ్యక్షులు కేసీఆర్ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ అన్ని అంశాలను క్రోడీకరించి మేనిఫెస్టో విడుదల చేస్తున్నట్లు సమాచారం.
ఈ మేనిఫెస్టోతో పాటు అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితాను కూడా విడుదల చేస్తారని అంటున్నారు. తొలి జాబితాలో మొత్తం 69 అభ్యర్ధుల పేర్లను ప్రకటించనున్నారనీ, అంతా సిట్టింగులే ఉండబోతున్నట్లు సమాచారం.