Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగ్గారెడ్డికి 2014 ఎన్నికల్లో పోటీ చేయగలరా...?

Webdunia
శనివారం, 5 ఏప్రియల్ 2014 (17:56 IST)
FILE
సిద్ధిపేటలో జగ్గారెడ్డికి కోర్టులో చుక్కెదురైంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులో మెదక్ జిల్లా సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హజరు పరిచి రెండు రోజుల రిమాండ్‌కు తరలించారు. సమైక్య కింగ్ అని ఎవరినయినా అనాలని అంటే అది జగ్గారెడ్డి అని వేరే చెప్పక్కర్లేదు.

ఎందుకంటే తెలంగాణలో ప్రజా ప్రతినిధులందరూ రాష్ట్రాన్ని ముక్కలు చేసి తెలంగాణ ఇచ్చేయాలని గోల చేస్తే కాదుకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉండాల్సిందేనంటూ ధైర్యంగా చెప్పిన తెలంగాణ నాయకుడు సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి... ముద్దుగా జగ్గారెడ్డి. జగ్గారెడ్డి మాట అప్పటి నుంచి ఇప్పటివరకూ ఒకటే.

అదే రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నది. కాకపోతే తెలంగాణ విడిపోయింది కాబట్టి తాను ఒక్కడినే ఏం చేయగలను అంటున్నారనుకోండి. ఇంతకీ ఈ జగ్గారెడ్డి గురించి పాత విషయాలను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.... ఆయనను ఓ కేసు విషయంలో పోలీసులు అరెస్టు చేశారు.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులో మెదక్ జిల్లా సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హజరు పరిచి రెండు రోజుల రిమాండ్‌కు తరలించారు. ఈయనపై గత 2010 సంవత్సరంలో ఈ కేసు నమోదు కాగా, ఆయనను పోలీసులు ఇపుడు అరెస్టు చేశారు.

అయితే, ఈ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరుకానందున ఆయనకు నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీచేసింది. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ఈ నెల 7న కోర్టు విచారించనుంది. కాగా అరెస్టు అయిన నేపధ్యంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Show comments